Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మార్చి 3న `మెట్రో` విడుద‌ల‌

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:58 IST)

Widgets Magazine
metro movie still

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై `ప్రేమిస్తే`, `జ‌ర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కిన సినిమా `మెట్రో`. ర‌జ‌ని తాళ్లూరి నిర్మాత‌. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నిర్మాత ర‌జ‌ని తాళ్లూరి మాట్లాడుతూ..``తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చ‌క్క‌ని మాట‌లు-పాట‌లు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్న‌ట్టే ఉంటుంది. గౌత‌మ్‌ మీన‌న్‌, అలాగే ఏ.ఆర్‌.మురుగ‌దాస్ అంత‌టి ప్ర‌ముఖులు మా సినిమాని ప్ర‌శంసించ‌డం ఆనందాన్నిచ్చింది. మార్చి 3న  సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని అన్నారు. 
 
స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ... ``చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్ ప్ర‌శంస త‌ర్వాత ట్రైల‌ర్ చూసి ఏ.ఆర్.మురుగ‌దాస్ అభినందించ‌డం మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. మురుగ‌దాస్ నిర్మించిన `ఎంగేయుమ్ ఎప్పోదుమ్‌` చిత్రాన్ని తెలుగులో `జ‌ర్నీ` పేరుతో అందించి విజ‌యం అందుకున్నాం. ఇప్పుడు ఆయ‌న ప్ర‌శంస పొందిన `మెట్రో` అంత‌కుమించి విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్స్‌కు ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం. మార్చి 3న సినిమా విడుద‌ల చేస్తున్నాం. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూడ‌దగ్గ సినిమా ఇది` అని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వేసవి సెలవుల్లో విక్టరీ వెంకటేష్ 'గురు'

తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ...

news

మెగా మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..!

మల్టీస్టారర్లు ఎనౌన్స్ చేయడం కాదు. దానికి ఎంత బడ్జెట్ అవుతుందనే లెక్క కూడా అవసరం. ఇలాంటి ...

news

కబాలిని బీజేపీ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటిస్తుందా? రజనీకాంత్ ఒప్పుకుంటారా?

కబాలి హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ బీజేపీలో చేరుతారని జోరుగా చర్చ సాగుతోంది. కానీ బాలీవుడ్ ...

news

ఎన్టీఆర్ సినిమాకు అభయ్ రామ్ టెంకాయ కొట్టాడు.. తాత సాయం చేశాడు... వీడియో వైరల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాను బాబి దర్శకత్వంలో నందమూరి ...

Widgets Magazine