మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (10:53 IST)

తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో: ఎంజీఆర్ పెరియప్ప.. శివాజీ చిత్తప్ప.. బాలయ్య డైలాగ్స్ అదుర్స్

తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సినిమా తెలుగులో హిట్టైనే నేపథ్యంలో తమిళంలో త్వరలో రిలీజ్ కానుంది. అంతకుముందు జరిగిన ఆడియో వేడుకకు బాలయ్య హాజరయ్యారు. ఈ వేడుకలో బాల

తమిళంలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సినిమా తెలుగులో హిట్టైనే నేపథ్యంలో తమిళంలో త్వరలో రిలీజ్ కానుంది. అంతకుముందు జరిగిన ఆడియో వేడుకకు బాలయ్య హాజరయ్యారు. ఈ వేడుకలో బాలయ్య బాబు మాట్లాడుతూ.. తాను ఇక్కడే పుట్టానని.. చెన్నై నీళ్లే తాగానని చెప్పారు.

చెన్నై గాలి పీలుస్తూ ఎదిగానని గర్వంగా చెప్పగలను. ఇంకా తాను తమిళబిడ్డనని హీరో బాలయ్య మాట్లాడారు. సోమవారం రాత్రి చెన్నైలోని కలైవానర్‌ ఆరంగంలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' తమిళ వర్షన్ ఆడియో విడుదల వైభవంగా జరుగగా, బాలకృష్ణ అందరినీ ఆకట్టుకునేలా స్వచ్ఛమైన తమిళంలో మాట్లాడారు. 
 
ఎంజీఆర్ తనకు పెదనాన్న అయితే, శివాజీ గణేశన్ చిన్నాన్నని, వీరి మధ్య తిరుగుతూనే తాను పెరిగి పెద్దవాడిని అయ్యానని బాలకృష్ణ చెప్పడంతో చప్పట్లతో ఆడిటోరియం మారుమోగింది. ఇంకా 'వీరపాండి కట్టబొమ్మన్‌' చిత్రంలో శివాజీ గణేశన్ చెప్పిన డైలాగులు చెప్పి తమిళ అభిమానులను బాలయ్య అలరించారు. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రాంతీయ భాషా చిత్రం కాదని, దేశం మొత్తం చూడవలసిన ఓ వీరుడి కథని చెప్పుకొచ్చారు.
 
ఈ కార్యక్రమంలో బాలయ్యతో పాటు క్రిష్, శ్రియ తదితరులు పాల్గొన్నారు. మరో హీరో కార్తి, దర్శకుడు కేఎస్ రవికుమార్, సంగీత దర్శకుడు చిరంతన్ భట్, నిర్మాతలు సీ కల్యాణ్, కాట్రగడ్డ ప్రసాద్, చిత్ర దర్శకుడు క్రిష్ తదితరులు పాల్గొన్నారు.