Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాసరి ఆరోగ్యంపై ఆందోళన.. భయం వద్దంటున్న తలసాని, మోహన్ బాబు

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:30 IST)

Widgets Magazine
Dasari

దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారం రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతున్న దాసరి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై దాసరి సన్నిహితులతో మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య, రాజా వన్నంరెడ్డి తదితరులు మాట్లాడారు. దాసరి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్లు జోగయ్య పాత్రికేయులకు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్‌లో దాసరి రెండు మూడు రోజుల్లో కోలుకుంటారని తెలియజేయడంతో జోగయ్య ఊపిరి పీల్చుకున్నారు. దాసరి త్వరగా కోలుకోవాలని మాజీ మంత్రి హరిబాబు ఆకాంక్షించారు. క్షీరపురి ఇంటర్నేషనల్‌ షార్టు ఫిల్మ్‌ కమటీ చైర్మన్‌ ముత్యాల శ్రీనివాస్‌, కన్వీనర్‌ డాక్టర్‌ కెఎస్‌ఎపిఎన్‌ వర్మ తదితరులు దాసరి సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
 
కాగా ద‌ర్శ‌కుడు, కేంద్ర‌ మాజీ మంత్రి దాసరి నారాయణరావుకి హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స కొన‌సాగుతోంది. ఆయ‌న‌కు శ‌స్త్ర‌చికిత్స చేసిన అనంత‌రం డాక్ట‌ర్లు బులిటెన్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సినీన‌టుడు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ... దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని అన్నారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావాల్సిన మనిషని పేర్కొన్నారు.
 
దాస‌రికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయ‌న పేర్కొన్నారు. త‌మ‌ గురువు దాసరి నారాయ‌ణరావు నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, అందరూ ఆయ‌న‌ ఆరోగ్యం కోసం ప్రార్థించాలని ఆయ‌న అన్నారుWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

క్రిష్‍‌నీ వదలని ఐటీ అధికారులు శాతకర్ణి బాలయ్యను ఎందుకు వదిలేశారో?

టాలివుడ్ నిర్మాతలపై ఐటీ కన్ను పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో ...

news

రాజమౌళిని ఆ విషయం నేనైతే అడగను... అడిగితే నేను ఓకే : నాగార్జున ఇంటర్వ్యూ

అక్కినేని నాగార్జున అటు కమర్షియల్‌ కథల హీరోనే కాకుండా.. ఇటు ఆధ్యాత్మిక చిత్రాల హీరోగా ...

news

చైతు-సమంతలు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి... నాగార్జున, సమంతకు కేటీఆర్ చీర

నాగార్జున త్వరలో తన ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లి చేయబోతున్నారు. మొన్ననే నాగచైతన్య- సమంతల ...

news

దాసరి అన్నవాహికకు రాపిడి ఏర్పడింది... సెన్సిటివ్ ఇష్యూ... మళ్లీమళ్లీ అడగొద్దు....

దర్శకరత్న దాసరి నారాయణ రావు అనారోగ్య సమస్య చాలా సున్నితమైనదనీ, దాని గురించి తమను ...

Widgets Magazine