ఇంకేంకావాలి..? ఇప్పుడే చనిపోయినా పర్లేదు.. నాగిని.. మౌనీ రాయ్

Last Updated: శనివారం, 17 నవంబరు 2018 (11:56 IST)
''నాగిని'' సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ బుల్లితెరపై సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఈ సీరియల్‌లో నటించిన నటీనటులకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. ముఖ్యంగా నాగినిలో కీలక పాత్రలో కనిపించిన నటి మౌనీ రాయ్‌కి సినీ ఆఫర్లు వస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసిన మౌనీ.. ప్రస్తుతం సినిమాలో నటిస్తోంది. 
 
ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్‌తో కలిసి నటిస్తోంది. ఈ సందర్భంగా మౌనీ మాట్లాడుతూ.. బిగ్ బితో కలిసి నటించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో కలిసి నటించే మంచి అవకాశం ఇంకోటి లేదు. ఇప్పుడే తాను చనిపోయినా పర్లేదని భావోద్వేగానికి లోనైంది. 
 
బిగ్ బితో నటించేటప్పుడు తన దృష్టి చెదిరిపోయేదని.. దిగ్గజ నటుడితో నటించేటప్పుడు కాస్త తడబడ్డాడని చెప్పింది. ప్రస్తుతం బ్రహ్మాస్త్రతో పాటు.. రాజ్ కుమార్ రావు నటిస్తున్న మేడ్ ఇన్ చైనా, జాన్ అబ్రహామం నటిస్తోన్న రోమియో అక్బర్ వాల్తేర్ సినిమాల్లో కనిపించనుంది.



దీనిపై మరింత చదవండి :