శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (17:24 IST)

మృణాల్ సేన్‌ను జీవించి ఉండగానే చంపేసిన నెటిజన్లు.. కుటుంబ సభ్యుల ఆవేదన!

సోషల్ మీడియాలో ఎవరో ఓ నెటిజన్ చేసే పోస్ట్/ట్వీట్ ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెడుతుందో ఈ తాజా ఘటనే ఉదాహరణ. ప్రముఖ ప్రముఖ బెంగాలీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ హాయిగా జీవించి వుంటే.

సోషల్ మీడియాలో ఎవరో ఓ నెటిజన్ చేసే పోస్ట్/ట్వీట్ ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెడుతుందో ఈ తాజా ఘటనే ఉదాహరణ. ప్రముఖ ప్రముఖ బెంగాలీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మృణాల్ సేన్ హాయిగా జీవించి వుంటే.. ఆయన చనిపోయినట్టు ఎవరో చేసిన ఓ ట్వీట్.. ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌లా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 
 
93 యేళ్ళ మృణాల్‌ సేన్‌ అనారోగ్యంతోనే జీవిస్తున్నారు. అయితే, ఆయన బతికుండగానే చనిపోయారంటూ సోషల్‌మీడియాలో రెండు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. ఇది నిజమనుకుని దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం కూడా తెలిపారు. చాలా వెబ్‌సైట్లు, కొన్ని చానెళ్లు ఆయనకు నివాళిగా ప్రత్యేక కథనాలను కూడా ప్రసారం చేశాయి. 
 
అయితే దీనిపై మృణాల్ సేన్ తనయుడు కునాల్ సేన్ స్పందిచారు. మృణాల్‌సేన్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఆయనకు ఏమీ కాలేదని వివరణ ఇచ్చారు. తర్వాత నిజం తెలుసుకున్న సెలబ్రెటీలు నాలిక్కర్చుకున్నంత పనిచేశారు. ఐదు దశాబ్దాల పాటు దర్శకుడిగా కొనసాగిన మృణాల్ భారతీయ సినిమా ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.