Widgets Magazine

'రామ్మా చిలకమ్మా' పాటను చిరంజీవి వద్దన్నారు.. ఎవరి దగ్గర చేతులు కట్టుకుని పనిచేయను: మణిశర్మ

శనివారం, 13 మే 2017 (15:16 IST)

Widgets Magazine
Chiranjeevi

సంగీత దర్శకుడు, మెలోడీ బ్రహ్మ మణిశర్మ టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సంగీతం సమకూర్చారు. తాజాగా ఆయనకు అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసే సంగీతం సమకూర్చిన మణిశర్మను ప్రస్తుతం పట్టించుకునే వారు లేకపోయారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న తెలుగు పాటలపై, ట్యూన్స్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
 
ప్రస్తుతం పాటల స్థాయి తగ్గడానికి గల కారణం హీరోలేనని చెప్పేశారు. హీరోల నిర్ణయాలకు అనుగుణంగా పాటల్ని ట్యూన్ చేయాల్సిన పరిస్థఇతులు ఏర్పడటంతో నేటి సినిమాల పాటల స్థాయి దిగజారిపోయిందంటూ మణిశర్మ ఘాటుగా విమర్శించారు. ఇదే సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా మణిశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
చిరంజీవి ఆల్ టైం హిట్ పాటల్లో 'చూడాలని ఉంది' లోని 'రామ్మా చిలకమ్మా' సాంగ్ గురించి మాట్లాడుతూ ఉదిత్ నారాయణ పాడిన ఈ పాట ఆ సినిమా నుండి తొలిగించమని చిరంజీవి చెప్పినా తాను వినకుండా అదే పాటను ఆ సినిమాలో ఉంచడంతో ఆపాట అప్పట్లో బంపర్ హిట్ అయ్యిందని మణిశర్మ గుర్తు చేశారు. 
 
అప్పట్లో టాప్ హీరోలు సంగీత దర్శకుడు చెప్పే మాటకు గౌరవం ఇచ్చేవారని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఫిలిమ్ ఇండస్ట్రీలో ప్రస్తుత వాతావరణానికి ఇమడలేక తాను చాలా అవకాశాలు వదులుకున్నానని మణిశర్మ అన్నారు. తనకు కథే ముఖ్యమని.. హీరోలు చెప్పే విధంగా బాణీలు, వారి ఛాయిస్ వల్ల సంగీతానికి కథతో సందర్భాలతో పనిలేకుండా పోతోంది. దీని వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. 
 
అందుకే తాను చిన్న దర్శకులతో పనిచేస్తున్నానని మణిశర్మ వివరించారు. చిన్న సినిమాల్లో వచ్చే పాటలే బాగున్నాయని.. ఇతరుల దగ్గర చేతులు కట్టుకుని పనిచేయలేనని.. ఎవరి దయతోనూ తాను బతకడం లేదని మణిశర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చైతూ-సమ్మూ పెళ్లెప్పుడు..? రారండోయ్ వేడుక చూద్దాం.. అని చెప్పేదెప్పుడు.. ఫ్యాన్స్ ప్రశ్న

సమంత, నాగచైతన్య ప్రేమ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ...

news

ఇంకా ఎవర్నీ ప్రేమించలేదు.. డేటింగ్ చేయాల్సి వస్తే అతనితోనే?: రకుల్ ప్రీత్ సింగ్

మిస్‌ ఇండియా ఫైనలిస్ట్.. నాలుగు సబ్ టైటిల్స్ గెలుచుకుని మోడలింగ్ రంగం నుంచి సినీ ...

news

సమంతతో జోడీ కట్టనున్న పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ...

నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగాక కొంత గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీ ...

news

మహేష్ బాబుతో ట్రైన్ సీన్‌లో నటించింది. కానీ నో యూజ్.. బాబు బాగా బిజీతో.. బిజీ బిజీ అయిపోతుందా?

బాబు బాగా బిజీ ద్వారా బాగా అందాలు ఆరబోసిన బోల్డ్ నటికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ...