శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:28 IST)

హీరో ప్రభాస్ అందరికీ డార్లింగ్... నాకు మాత్రం అలా కాదు : తమన్నా

హీరో ప్రభాస్‌పై హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్‌లో ప్రతి ఒక్కరూ ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ పిలుస్తారు. కానీ, తనకు మాత్రం డార్లింగ్ కాదనీ.. డియర్ ఫ్రెండ్, ఎమేజింగ్ ఫ్రెండ్ అని వ్యా

హీరో ప్రభాస్‌పై హీరోయిన్ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోలీవుడ్‌లో ప్రతి ఒక్కరూ ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ పిలుస్తారు. కానీ, తనకు మాత్రం  డార్లింగ్ కాదనీ.. డియర్ ఫ్రెండ్, ఎమేజింగ్ ఫ్రెండ్ అని వ్యాఖ్యానించింది. 'బాహుబలి-2' తమిళ ఆడియో వేడుక ఆదివారం రాత్రి చెన్నైలో కన్నులపండుగగా జరిగింది. 
 
ఇందులో ఆమె పాల్గొని మాట్లాడుతూ... 'బాహుబలి' చిత్రంలో నటించడమే ఒక గొప్ప అవకాశమని, ఈ సినిమాలో నటించేటప్పుడు తాను అవార్డులు ఆశించలేదని, అసలు ఇలాంటి సినిమాలో నటించడమే ఒక అవార్డు అని అన్నారు. అలాగే సినిమాకు కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ అందించారని, తాను నటించిన పాటకు ఆయన ఇచ్చిన ట్యూన్ తన జ్ఞాపకాల్లో పదిలంగా నిలిచిపోయిందని తమన్నా తెలిపింది.