Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

‘ఓ మరిచిపోలేని రాత్రి.. కొత్త జీవితానికి ప్రారంభం'.. తల్లితో.. తండ్రితో.. నాగచైతన్య

మంగళవారం, 31 జనవరి 2017 (14:14 IST)

Widgets Magazine
chaitu - lakshmi - nag

అక్కినేని నాగచైతన్య, స్టార్‌ హీరోయిన్‌ సమంతల నిశ్ఛితార్థం కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, ఈ నిశ్చితార్థానికి ఓ ప్రత్యేక అతిథి రావడం గమనార్హం. ఆమె ఎవరో కాదు.. నాగచైతన్య తల్లి. నాగార్జున భార్య. ఆమె పేరు లక్ష్మి. తండ్రి నాగార్జున, తల్లి లక్ష్మితో కలిసి నాగచైతన్య ఒకే వేదికపై కనిపించారు. వారిద్దరూ వారి వారి భాగాస్వాములతోనే కొడుకు నిశ్ఛితార్ధ ఫంక్షన్‌కు హాజరయ్యారు. 
 
సినీ నటి అమలను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగార్జున.. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడి కూతురు, హీరో వెంకటేష్‌, నిర్మాత సురేష్‌బాబుల చెల్లెలు అయిన లక్ష్మిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి నాగచైతన్య పుట్టిన తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు చైతన్య ఎంగేజ్‌మెంట్‌ సందర్భంగా అందరూ తమ తమ కుటంబాలతో తరలివచ్చారు. 
 
అలాగే, ఎప్పుడూ పెద్దగా బయటకు రాని వెంకటేష్‌ భార్య నీరజ, కూతుళ్లు కూడా ఈ ఫంక్షన్‌కు వచ్చారు. ఈ ఫోటోలన్నింటినీ చైతన్య తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. ‘ఓ మరిచిపోలేని రాత్రి.. కొత్త జీవితానికి ప్రారంభం.. ఇంత సంతోషానికి కారణమైన నా సమంతకు ధన్యవాదాలు’ అని చైతూ ట్వీట్‌ చేశాడు.
nagachaitu - lakshmiWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎక్కడ నా ప్రాణం అంటోన్న నాని.. నేను లోకల్ సాంగ్ విడుదల.. యూట్యూబ్ ట్రెండింగ్‌లో 13వ స్థానం.. (Video)

''నేను లోకల్'' సినిమాపై క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. నాని, కీర్తి సురేష్ జంటగా నటించే ఈ ...

news

1998లోనే నాపై రేప్ జరిగింది.. హాలీవుడ్‌లోనే మహిళలకు జీతాలు తక్కువే: ఆష్లే జడ్

ప్రముఖ హాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త ఆష్లే జడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆష్లే ...

news

బండ్ల గణేష్ అమ్మాయిలను సప్లై చేసే బ్రోకరా? ఆ హీరోయిన్ ఏమంటోంది?

సినిమాల్లో హీరోల పక్కన చిన్నచిన్న క్యారెక్టర్లు వేస్తూ వచ్చి బండ్ల గణేష్... కాలక్రమంలో ...

ముంబై మోడల్స్‌కు అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్.. నా గెటప్ లీకైతే తాట తీస్తా..!

ప్రస్తుతం సెల్ఫీ పిచ్చి అంతా ఇంతా కాదు. సెల్ఫీలు తీసుకోవడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

Widgets Magazine