శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2017 (15:07 IST)

ఏది బూతు? ఏది కామెడీ? అనేది వాళ్లే నిర్ధారించాలి: నాగబాబు

జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్

జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది అనాథలపై చేసిన వివాదాస్పదమైన నేపథ్యంలో ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఓ చర్చా కార్యక్రమంలో నాగబాబు మీడియాపై ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై జబర్దస్త్ నటుడు హైపర్ ఆదితో మాట్లాడేందుకు మీడియా ప్రయత్నించింది. అయితే ఆది దొరక్కపోవడంతో.. జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న నాగబాబుతో మాట్లాడేందుకు యాంకర్ ప్రయత్నించారు. కానీ నాగబాబు లైవ్‌లో మాట్లాడేందుకు నిరాకరించారు. 
 
మీడియా, మేధా సంఘాలు, మహిళా సంఘాలన్నీ ఏం ఉద్ధరిస్తాయంటూ ప్రశ్నించారు. వీరికి స్పందించాల్సిన అవసరం లేదని.. ఏది బూతు? ఏది కామెడీ? అనే విషయాన్ని నిర్ధారించాల్సింది ప్రేక్షకులు మాత్రమేనని నాగబాబు తెలిపారు. కానీ ఇదంతా లైవ్‌లో జరగలేదని.. ఫోన్ ఇన్ తీసుకునేందుకు మీడియా ప్రయత్నించినప్పుడు జరిగిన విషయమని సదరు టీవీ యాంకర్ లైవ్ షోలో వివరించి చెప్పారు.
 
హైపర్ ఆది స్కిట్‌లో భాగంగా ఇంతకీ అనాథలు అంటే అతిగా ఆవేశపడే ఆడదానికి.. అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు అంటారని తనదైన శైలిలో బూతు కామెడీకి తెరతీస్తూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో అనాథలు అంటే సంఘంలో ఓ గౌరవం ఉందని మమ్మల్ని కించపరచడమే కాకుండా మా గౌరవానికి భంగం కలిగేలా స్కిట్ చేసిన జబర్దస్త్ కామెడీ షోపైన హైపర్ ఆదిపైన చర్యలు తీసుకోవాలంటే అనాథ యువతులు సైఫాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.