నాగ్-నాని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నానిల క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతోన్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నా

nani - nag
Srinivas| Last Modified సోమవారం, 21 మే 2018 (20:25 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నానిల క్రేజీ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతోన్న‌ సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు సమాచారం. ఇంత‌కీ ఎప్పుడంటారా..? ఈ మల్టీస్టారర్ వినాయక చతుర్థి కానుకగా సెప్టెంబరు 12న రిలీజవుతుందట. 
 
13న పండుగ కాగా.. ఒక రోజు ముందే సినిమాను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ రోజు బుధవారం కావడం విశేషం. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఉపయోగించుకోవడానికి ఇలా సినిమాను రిలీజ్ చేయనున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వారాంతంలో భారీ వసూళ్లు సాధించడానికి అవకాశముంటుంది. వేసవితోనే తెలుగులో భారీ సినిమాల హవాకు తెరపడింది. మధ్యలో మీడియం రేంజి సినిమాలే వస్తాయి. 
 
ఇక రాబోయే పెద్ద సినిమా అంటే ఇదే అవుతుంది. కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయనడంలో సందేహం లేదు. హైప్‌కు తగ్గట్లే సినిమా అంటే పెద్ద విజయం సాధించే అవకాశముంటుంది. 
 
ఈ చిత్రాన్ని వినాయక చవితికి రిలీజ్ చేయడానికి ఇంకో కారణం కూడా ఉంది. సినిమాలో వినాయ‌క చ‌వితి నేపథ్యంలో ఒక పాట కూడా ఉంటుందట. ఆ నేపథ్యంలో పండక్కి సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించారు. అందుకే ఆగస్టుకు అనుకున్న ఈ చిత్రానికి సెప్టెంబరుకు వాయిదా వేశారు. 
 
ఇందులో నాగ్ డాన్ పాత్ర చేస్తుండగా.. నాని డాక్టర్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. నాగ్ సరసన ‘మళ్ళీ రావా’ ఫేమ్ ఆకాంక్ష సింగ్.. నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్నా నటించనున్నారు. మ‌రి...ఈ నాగ్ - నాని క‌లిసి ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తారో చూడాలి.దీనిపై మరింత చదవండి :