శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (13:03 IST)

'సోగ్గాడే చిన్న నాయనా'.. కథ ఇదేనా? : సోగ్గాడు చనిపోతాడట!

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున, సీనియర్ నటి రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటిలు జంటగా నటిస్తున్న చిత్రం "సోగ్గాడే చిన్ని నాయనా". ఈ చిత్రం షూటింగజ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రం టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.
 
 
ఈ సందర్భంగా ఈ చిత్రంలో తన క్యారెక్టర్ గురించి నాగార్జున వెల్లడించారు. తన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌‍కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో తండ్రికొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నా. ఇందులో యువకుడి పాత్ర చాలా స్మార్ట్‌గా కనిపించి అందరిని అకట్టుకుంటాడు.
 
అయితే, ఈ మూవీలో తండ్రి పాత్ర అయిన సోగ్గాడు చనిపోయి ఒక ఆత్మలా మారి తన కొడుకుకి మాత్రమే కనిపిస్తుంటాడని, అమాయకుడైన తన కొడుకుకి, తండ్రికి మధ్య జరిగే ఎపిసోడ్స్ ఫన్నీగా ఉంటాయని నాగార్జున సూచాయిగా వెల్లడించారు. కాగా, ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.