శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pyr
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (08:06 IST)

నేను త్వరలోనే రాజకీయాల్లోకి వస్తా... తమిళ పార్టీలు ఆహ్వానిస్తున్నాయ్... ఎవరా నటి?

నాకు ప్రత్యేకతను ప్రసాదించింది తమిళ ప్రేక్షకులు. గుర్తింపునిచ్చింది తమిళులు. అందుకే తమిళ ప్రజలకు మంచి చేసేందుకైనా రాజకీయాల్లోకి వస్తాను. త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానంటూ సినీ కథానాయిక నమిత చెప్పారు. తనది గుజరాత్‌ అయినా... తమిళనాడు సరికొత్త జన్మనిచ్చిందని అన్నారు. 
 
తన జీవితం ఈ రాష్ట్రానికే అంకితం చేయనున్నట్లు వివరించారు. రాజకీయాలలో చేరేందుకు  పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిందని తెలిపారు. అయితే ఎవరు పిలిచారన్నది ఇప్పుడు చెప్పనని అన్నారు. స్లిమ్‌గా తయారై అందరికీ ఎలా షాకిచ్చానో, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అందరికీ షాకివ్వబోతున్నానని అన్నారు. రాజకీయాల్లోనూ అనుకున్నది సాధించి తీరుతానని అమ్మడు ధీమా వ్యక్తం చేస్తున్నారు.