శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 అక్టోబరు 2015 (11:48 IST)

ఆదితో నమిత నటిస్తుందా? నిజంగానా?

ఆదితో నమిత నటిస్తుందా? నిజంగానా? అనే డౌట్ మీలో కలుగొచ్చు. నమిత సీనియర్ నటికదా.. ఆదితో కలిసి నటిస్తుందా... కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందా అనే ఆలోచిస్తున్నారా అయితే కరెక్టేనండీ.. ఇక్కడో చిన్న ట్విస్టుంది. ఈ నమిత ఆ నమిత కాదు. ఈ అమ్మాయి పూర్తి పేరు నమిత ప్రమోద్. మలయాళ కుట్టి. అక్కడ దాదాపు పది సినిమాల దాకా నటించి బాగానే  పేరు తెచ్చుకుంది. 
 
తమిళంలో కూడా ఓ సినిమా చేసింది. ఇప్పుడు వీరభద్రం చౌదరి దర్శకత్వం వహించబోతున్న సినిమాతో తెలుగులో అడుగుపెడుతోంది. ఆ సినిమా పేరు.. చుట్టాలబ్బాయి. ఎప్పుడో ఆర్నెల్ల ముందే ఈ ప్రాజెక్టు ఓకే అయినప్పటికీ.. ఎట్టలకే విజయదశమి రోజు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది.
 
అహనా పెళ్లంట - పూల రంగడు లాంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన వీరభద్రం.. ‘భాయ్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించలేకపోయాడు. ఇక ''చుట్టాలబ్బాయి''తో హిట్ కొట్టాల్సిందేనని వీరభద్రం భావిస్తున్నాడు.