గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:08 IST)

గౌతమిపుత్ర శాతకర్ణి ఎఫెక్ట్.. రూ.10కోట్లు పారితోషికం పెంచేసిన బాలయ్య..

క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. క్రేజ్‌తో పాటు బాలయ్య బాబు పారితోషికం క

క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న నందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాతో బాలయ్య క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. క్రేజ్‌తో పాటు బాలయ్య బాబు పారితోషికం కూడా పెరిగిపోయింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా 50 కోట్ల రూపాయల షేర్‌ సాధించగలిగింది. అంతేకాదు తొలిసారిగా ఓవర్సీస్‌లో బాలయ్యకు భారీ కలెక్షన్లు అందించింది. 
 
ఈ సినిమా అందించిన సక్సెస్‌తో బాలయ్య పారితోషికాన్ని బాగా పెంచేశాడని తెలుస్తోంది. ఇప్పటివరకు బాలయ్య ఒక సినిమాకు దాదాపు ఏడుకోట్ల వరకు తీసుకునేవాడని.. ఇక నుంచి ఒక సినిమాకు పది కోట్ల రూపాయల్ని పారితోషికంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. మాస్‌లో తిరుగులేని ఇమేజ్‌ ఉన్న బాలకృష్ణ పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ తీసుకోవడం సమంజసమేనని సినీ పండితులు అంటున్నారు. కానీ నిర్మాతలు, దర్శకులు మాత్రం కాస్త ఓవరేనని చెవులు కొరుక్కుంటున్నారట. 
 
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తామని బాలకృష్ణ ప్రకటించారు. త్వరలోనే ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తానని అందులో ఎన్టీఆర్ పాత్రను నేనే పోషిస్తానంటూ నందమూరి అభిమానుల్లో జోష్ నింపారు.

నందమూరి తారక రామారావు స్వస్థలమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వాసుపత్రికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌ సినిమాను ఎప్పటినుండో తెరపైకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానని, ఈ సినిమాకి దర్శకుడిగా ఇంకా ఎవర్నీ డిసైడ్ చేయలేదని త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. కేవలం ఎన్టీఆర్ బయోపిక్ మాత్రమే కాకుండా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడానికి ప్రయత్నిస్తానన్నారు బాలయ్య.