శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2017 (12:55 IST)

బక్కగాళ్లు, బలుపుగాళ్లు, బఫూన్లకు బయపడేది లేదు... మద్దినేని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాల

maddineni ramesh babu
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులను విమర్శించిన వాళ్లను రాయలేని బూతులు తిడుతూ టాలీవుడ్ అసిస్టెంట్ దర్శకుడు మద్దినేని రమేష్ బాబు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టులు పెడుతూ, రాంగోపాల్ వర్మపై మండిపడ్డాడు. రాంగోపాల్ చేసిన ఆరోపణలను తప్పుపడుతూ, కుటుంబ సభ్యులతో చీకొట్టించుకున్నాడని, అయినా బుద్ధి తెచ్చుకోలేదని విమర్శించాడు. సెక్యూరిటీ లేకుండా బయట తిరగలేని బతుకు బతుకుతున్నాడని నిప్పులు చెరిగాడు.
 
'బన్నీ'గాళ్లు, 'బుజ్జి'గాళ్లు, 'బండ్ల'గాళ్లు అంటూ నంది అవార్డుల విధానాన్ని విమర్శించిన బన్నీ వాసు, నల్లమలుపు బుజ్జి, బండ్ల గణేశ్ తదితరులనూ వదల్లేదు. బక్కగాళ్లు, బలుపుగాళ్లు, బఫూన్లకు బయపడేది లేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన కామెంట్స్‌ను పరిశీలిస్తే...
 
"నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది .. నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా... ఈ సమాజం మీద నాకు బాధ్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిన నీకు నంది అవార్డ్స్ మీ మాత్రం బాధ్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ... నిజాయితీగా పనిచేసిన మా 2016 కమిటీ గురించి మాట్లాడితే ఒప్పుకోం... ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీదొక బతుకేనా? ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబడ్దార్.. బక్కగాల్లకీ బలుసుగాల్లకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు... ఖబడ్దార్.. మీ తోక ఊపుడు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు అంటూ దర్శకుడు రాయలేని భాషలో పచ్చిబూతులతో ఏకిపారేశాడు.