గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : సోమవారం, 27 జూన్ 2016 (16:08 IST)

రజినీకాంత్‌ను ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వారిలో నేను ఒక‌డిని : నాని

ర‌జినీకాంత్‌, రాధికా ఆప్టే, ధన్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `కబాలి`. కలైపులి ఎస్. థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్

ర‌జినీకాంత్‌, రాధికా ఆప్టే, ధన్సిక‌, కిశోర్‌, జాన్ విజ‌య్ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం `కబాలి`. కలైపులి ఎస్. థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై పా.రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్ నిర్మాతలు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ జె.ఆర్‌.సి. క‌న్వెక్ష‌న్ సెంట‌ర్‌లో జ‌రిగింది. సీడీ, ఆడియో సీడీలను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా టి.సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ, తెలుగు ప్ర‌జ‌ల‌కు ర‌జినీకాంత్ అంటే చాలా అభిమానం. ఆయ‌న్నెంతో గ్రాండ్‌గా రిసీవ్ చేసుకుంటారు. ర‌జినీకాంత్‌ భార‌త‌దేశ చ‌ల‌న చిత్రానికి దొరికిన కోహినూర్ డైమండ్‌. త‌న యాక్టింగ్‌, డ్యాన్సుల‌, ఫైటింగ్స్ చేసిన ఏదీ చేసినా సంచ‌ల‌న‌మే. నాకు చాలా మంచి స్నేహితుడు. నేను చేసిన‌ "జీవ‌న‌పోరాటం" సినిమాలో ర‌జినీకాంత్ న‌టించారు. ఆయ‌న స్ట‌యిలే వేరు. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 
 
హీరో నాని మాట్లాడుతూ, అందరిలా ర‌జినీకాంత్‌ని ఇమిటేట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వారిలో నేను ఒక‌డ్ని. తెలుగులో సినిమాను విడుద‌ల చేసిన నిర్మాత‌లు ప్ర‌వీణ్ చౌద‌రి, కె.ప్ర‌వీణ్‌కుమార్ వ‌ర్మ‌ చాలా ప్యాష‌న్‌తో సినిమాను తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. నేను రోబో సీక్వెల్ కంటే క‌బాలి కోసం వెయిట్ చేస్తున్నాను. క‌బాలి టీజ‌ర్‌, సాంగ్స్ చూస్తుంటే నాకు ర‌జినీకాంత్‌గారి 'బాషా' సినిమా గుర్తుకు వ‌స్తుంది. సినిమా విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. 
 
మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, నేను చిన్న‌ప్పుడు ర‌జినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్‌. టీం అంత‌టికీ కంగ్రాట్స్‌. నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు అని అన్నారు. 
 
చాముండేశ్వ‌రి నాథ్ మాట్లాడుతూ, నేను ర‌జినీకాంత్‌గారి సినిమాల‌ను మొద‌టిరోజునే చూస్తుంటాం. ఇప్పుడు కూడా ఆయ‌న సినిమా కోసం మా ఫ్యామిలీ స‌భ్యులు కూడా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. 
 
బీజేపీ నేత ర‌ఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ, క‌బాలి సినిమా ఏడు వేల థియేట‌ర్స్‌లో విడుద‌ల కానుంది. ప్ర‌ప‌చంలో ఏ హీరోకు లేనంత ఫాలోయింగ్ ర‌జినీకాంత్‌కే సొంతం. ఆయ‌న ఎంత పెద్ద స్టార్ అయినా రియ‌ల్ లైఫ్‌లో చాలా సింపుల్‌గా ఉంటారు. ఈ సినిమా ర‌జినీకాంత్‌ కెరీర్‌లోనే పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నట్టు చెప్పారు. 
 
ప‌రుచూరి గోపాల‌కృష్ణ మాట్లాడుతూ, గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తి. ర‌జినీకాంత్‌ లుక్ బాషా సినిమాను త‌ల‌పిస్తుంది. సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు. 
 
కోదండ‌రామి రెడ్డి మాట్లాడుతూ, నిర్మాతలు తెలుగు రైట్స్‌ను చేజిక్కించుకోవ‌డంతోనే స‌క్సెస్ అయ్యారు. వారికి ఆల్ ది బెస్ట్‌. ద‌ర్శ‌కుడు గ‌త చిత్రాలు రెండు మంచి విజ‌యాల‌ను సాధించాయి. త‌న మూడో సినిమా క‌బాలి సూప‌ర్ హిట్ అవుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌ చెప్పారు. 
 
చైత‌న్య రాజ్ మాట్లాడుతూ, మ‌న దేశంలో సినీ జ‌గ‌త్తులో గొప్ప న‌టుడు, దార్శ‌నికుడు, దాన‌గుణం ఉన్న వ్య‌క్తి ర‌జినీకాంత్‌గారు. ఈ సినిమా విడుద‌ల కోసం 30 నుండి 40 దేశాలు వెయిట్ చేస్తున్నాయి. టీజ‌ర్‌కే ట్రెమండెస్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా పెద్ద హిట్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 
 
ప్ర‌తాని రామ‌కృష్ణ‌ గౌడ్ మాట్లాడుతూ, తెలుగు నిర్మాత‌ల‌కు కె.పి.చౌద‌రి, కె.ప్ర‌వీణ్‌కుమార్‌కి అభినంద‌నలు. త‌ప్ప‌కుండా పెద్ద విజ‌యం సాధిస్తుంది. ఇండ‌స్ట్రీలో సినిమాపై పెద్ద క్రేజ్ ఉంది. ర‌జ‌నీకాంత్‌కి ప్ర‌పంచం అంత‌టా అభిమానులున్నారు. సినిమా నిర్మాత‌లు మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నట్టు చెప్పారు. 
 
అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ర‌జినీకాంత్‌ మంచి హ్యుమ‌న్ బీయింగ్‌, గొప్ప నటుడు. క‌బాలి వంటి సినిమాను విడుద‌ల చేస్తున్న నిర్మాత‌ల‌కు అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నట్టు చెప్పారు. 
 
హీరో వ‌రుణ్‌ తేజ్ మాట్లాడుతూ, రజినీకాంత్‌ చాలా సింపుల్‌గా ఉంటారు. మేమంద‌రం ర‌జినీకాంత్‌కి పెద్ద ఫ్యాన్స్‌. పెద్ద‌నాన్న‌, ర‌జినీకాంత్‌ మంచి స్నేహితులు. 'బాషా' త‌ర్వాత ఇలాంటి ర‌జినీకాంత్ సినిమాను మిస్ అయ్యాం. పా రంజిత్‌ బాషాలో ర‌జ‌నీకాంత్‌గారిని చూపిస్తున్నారు. నిర్మాత‌లకు అభినంద‌నలు అని చెప్పారు. 
 
చిత్ర దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ, సినిమాపై చాలా అంచ‌నాలు ఉన్నాయి. వారి అంచ‌నాలు నేరవేర్చ‌గ‌లుగుతాన‌ని అనుకుంటున్నాను. త‌మిళం కంటే తెలుగులో గ్రాండ్ లెవ‌ల్లో ఆడియో విడుద‌ల‌వుతుంది. నిర్మాత‌ల‌కు ధన్యవాదాలు అని చెప్పారు. 
 
కె.ప్రవీణ్ కుమార్ వర్మ మాట్లాడుతూ, నేను షణ్ముక ఫిలింస్‌తో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. పెద్ద సినిమా చేయాలని నా భయ్యా కె.పి.చౌదరి అనగానే మాకు కనపడిన సినిమా 'కబాలి'. మా కృష్ణ అంకుల్ వచ్చి మోహన్ బాబుగారి వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఫోన్ చేసి సినిమా మాకు రావడంలో ఎంతో హెల్ప్ చేశారు. ఆయనకు థాంక్స్. అలాగే అల్లు అరవింద్ ఫైనాన్సియల్‌‍గా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఆయన కూడా కలైపులి థానుతో మాట్లాడారు. దాంతో థాను రైట్స్ మాకిచ్చారు. ఈ స్టేజ్‌కు రావడానికి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ కబాలి చిత్రాన్ని హిట్ చేసి మా ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.