Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"కథలో రాజకుమారి" కోసం రఫ్ లుక్‌తో రోహిత్

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (19:58 IST)

Widgets Magazine
nara rohit

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి". శ్రీహాస్ ఎంటర్‌టైన్మెంట్స్ మరియు అరణ్ మీడియా వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్‌ను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నేడు (ఫిబ్రవరి 14) విడుదల చేశారు. మహేష్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంతి, సౌందర్య నర్రా, కృష్ణ విజయ్ నిర్మాతలు. నారా రోహిత్ తోపాటు నాగశౌర్య మరో ముఖ్యపాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ కీలకపాత్రధారి. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ""జ్యో అచ్యుతానంద" అనంతరం నారా రోహిత్-నాగశౌర్యలు కలిసి నటిస్తున్న సినిమా ఇది. నారా రోహిత్ రఫ్ లుక్‌తో విడుదల చేసిన పోస్టర్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన లభిస్తోంది. నారా రోహిత్ చాలా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్‌లో ఈ సినిమాలో కనిపించనున్నారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 
 
ఆడియో, ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. మహేష్ సూరపనేని ఈ చిత్రంలో రోహిత్ వేషధారణను తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అలాగే ఆయన "కథలో రాజకుమారి" చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది" అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఘాజీ' యూట్యూబ్ సినిమా.. అనుకోకుండా వెండితెరపై ఆవిష్కరించాం : సంకల్ప్ రెడ్డి

దర్శకునిగా తొలి చిత్రాన్ని ప్రేమకథతో కాకుండా యుద్ధ నేపథ్యంలోసాగే కథతో ముందుకు వచ్చిన ...

news

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు భామలు.. రాశిఖన్నా ఓకే.. కాజల్-తమన్నాలను కూడా సెలెక్ట్ చేశారా?

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా ...

news

రకుల్ ప్రీత్ సింగ్ "పరేశానురా సాంగ్‌"కు యూట్యూబ్‌లో మంచి క్రేజ్.. ఆకట్టుకున్న స్కిన్ షో..

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ...

news

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున ...

Widgets Magazine