Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకుమారి, రాణి పాత్రలకు కేరాఫ్‌గా మారిన దేవసేన

హైదరాబాద్, శనివారం, 15 ఏప్రియల్ 2017 (05:54 IST)

Widgets Magazine

తెలుగు సినిమాల్లో రాణుల పాత్రలకు కేఆర్ విజయ, రాజశ్రీ, జయలలిత, జమున వంటివారు పేరెన్నిక గన్నవారు. వారి తర్వాత పౌరాణిక, జానపద చిత్రాల్లో రాణులుగా, యువరాణులుగా మెరిసిన హీరోయిన్లు దాదాపుగా లేరనే చెప్పాలి. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు తెలుగులోనే కాదు. దక్షిణాదిలోనే కాదు. యావద్బారత చిత్ర పరిశ్రమలోనే రాణి అంటే దేవసేన అనే చెప్పాల్సి ఉంటుంది. అరుంధతి నుంచి మొదలుకుని రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వరకు ప్రాచీన మధ్యయుగాల మహారాణులకు జీవం పోస్తున్న ఏకైక నటి అనుష్క.
Anushka
 
ఈమధ్యే బాహుబలి 2 ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నయ్‌లో జరిగితే ఆ కార్యక్రమానికి హాజరైన నందనంలోని వైఎంసీఎ స్టేడియంలో పాల్గొన్న వేలాదిమంది ప్రేక్షకుల మతులు పోగొట్టారు. స్టేజిమీద యాంకర్ అయితే ప్రశంసల మీద ప్రశంసలు. మిమ్మల్ని చూడటానికే 75 వేలమంది ప్రేక్షకులు ఇవ్వాళ ఫంక్షన్ కోసం వచ్చారని పొగడ్తలు. కార్యక్రమం ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల చూపులన్నీ ఆమె పైనే. హుందాతనం, అణకువ, నమ్రత, వివాదాలకు ఇసుమంతయినా తావియ్యకుండా ఒక్కరిని కూడా నెగటివ్‌గా కామెంట్ చేయకుండా పదేళ్లు చిత్రసీమలో గడిపిన అనుష్క  ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటున్న తారల్లో అగ్రగామిగా ఉంటున్నారు.
 
అయితే ఇంతటి గుర్తింపు, ప్రాభవం ఆమెకు ఆయాచితంగా లభించలేదు. ఆదిలో అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇచ్చిన ఆనుష్క తర్వాత నటనకు ప్రాదాన్యత ఇవ్వడం మొదలెట్టారు. పాత్రకు తగ్గట్టు అభినయించడమే కాదు, అందుకు తగ్గట్టుగా తనను మలచుకోవడానికి శ్రమించే నటి అనుష్క.అందుకే అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఇక అరుంధతి చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ఆ తరువాత రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. 
 
ప్రస్తుతం బాహుబలి– 2లో మరోసారి బ్యూటీ నట విజృంభణను చూడబోతున్నాం. అదే విధంగా మధ్యలో ఇంజి ఇడుప్పళగి(తెలుగులో జీరోసైజ్‌) చిత్ర కోసం సుమారు 90 కిలోల బరువును పెంచుకుని నటించారు. అంత సాహసం మరో నటి చేస్తుందని చెప్పలేం.అదే విధంగా నటిగా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్న అనుష్క వేదం చిత్రంలో వేశ్యగా నటించారు. ఆ సమయంలో ఆ పాత్రను పోషించవద్దని, ఇమేజ్‌ బాధిస్తుందని చాలా మంది భయపెట్టారట.అయినా పాత్ర మీద నమ్మకంతో ధైర్యంగా నటించారు. ఆ పాత్ర తన ఇమేజ్‌ను ఏమాత్రం డ్యామేజ్‌ చేయలేదని చెన్నైలో మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అనుష్క పేర్కొన్నారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమన్నా దృక్పధాన్నే మార్చిన బాహుబలి: డీగ్లామర్ పాత్రకు సై

బాహుబలి సినిమాలో అన్ని పాత్రల కంటే బలహీనమైన పాత్ర తమన్నాదే అనుకున్నాం. కానీ అవంతిక ...

news

ఎంత ఆర్య అయితేనేం... అడవిలో బిర్యానీ పెడతాడా: వాపోయిన కేథరీన్

అర్యతో కలిసి నటించిన కడంబన్ చిత్రం షూటింగ్‌ను కోడైకెనాల్ సమీపంలోని దట్టమైన అడవుల్లో ...

news

మురగదాస్ అంత చెత్త దర్శకుడా.. ప్రియదర్శన్ ఇలా పరువు తీశారేంటి?

ఆర్ట్ సినిమాలు, వాణిజ్య సినిమాలు అనే సరిహద్దు చెరిగిపోయిన కాలమిది. లేకపోతే బాహుబలి, ...

news

వరుణ్ తేజ్ 'మిస్టర్' సినిమా రివ్యూ ... ప్రేక్షకులను తికమకపెట్టే స్పెయిన్ బుల్లోడు

'ముకుంద'‌, 'కంచె', 'లోఫ‌ర్' వంటి విభిన్న సినిమాల‌తో మెగా హీరో వ‌రుణ్ తేజ్ ప్రేక్ష‌కుల‌కు ...

Widgets Magazine