గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 7 అక్టోబరు 2015 (16:39 IST)

చీర కట్టిన నిఖిల్‌... ఎక్కడ ఎప్పుడు...?

అవాక్కయ్యారా! ఇది నిజమే... నటుడు నిఖిల్‌.. చీరకట్టుకోమని తెలియజేస్తున్నాడు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. దీనికి సంబంధించిన షూట్‌ను నెల్లూరులో చేశారు. అయితే మగవారు ఫ్యాంట్స్‌, ఫర్ట్స్‌, నిక్కర్లు, బనియన్లకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా వుంటూ ప్రమోట్‌ చేస్తుంటారు.
 
కానీ తొలిసారిగా యూత్‌ హీరో నికిల్‌ చీరలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వుండటం ఆశ్చర్యమే మరి. టీవీ యాడ్‌ కోసం తనను షూట్‌ చేస్తుండగా చిత్ర యూనిట్‌లో ఒకరు పైవిధంగా కామెంట్‌ చేశారని తెలిసింది. దాంతో నిఖిల్‌ చీరకట్టుకున్నాడనేది ఫిలింనగర్‌లో హాట్‌హాట్‌గా మారిపోయింది. అదీ సంగతి.