శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 27 ఆగస్టు 2015 (20:32 IST)

'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పకుడు. ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. యామీ గౌతమ్‌ కథానాయిక. గురుఫిలింస్‌, మల్టీడైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ సందర్భంగా గౌతమ్‌ మీనన్‌ మాట్లాడుతూ... రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ, థ్రిల్లర్‌ అంశాలు మేళవించిన చిత్రమిది. సాధారణ కొరియర్‌బాయ్‌గా పనిచేసే ఓ యువకుడి జీవితంలో ఎదురైన అనూహ్య సంఘటనలు, వాటి పరిణామలేమిటి? సవాళ్లను అధిగమించే క్రమంలో అతడు ఎలాంటి పోరాటాన్ని సాగించాడు? లక్ష్యంతోపాటు ప్రేమలోనూ ఏ విధంగా విజయం సాధించాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
 
నితిన్‌ చక్కటి నటన కనబర్చాడు. దర్శకుడు చక్కటి భావోద్వేగాలతో చిత్రాల్ని రూపొందించాడు. కథలోని మలుపులు ఆకట్టుకుంటాయి. ఇటీవలే విడుదలైన గీతాలకు శ్రోతల నుంచి స్పందన లభిస్తోంది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం, సందీప్‌ చౌతా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్రధానాకర్షణగా వుంటాయి. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరినీ మెప్పించే చిత్రమవుతుందని' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్య పొన్‌మార్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌పూడి, రచనా సహకారం: కోన వెంకట్‌, హర్షవర్ధన్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: స్వాతి రఘురామన్‌, విజయ్‌ శంకర్‌.