Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా'... హీరోను అలా అనేసి నిత్యామీనన్

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (16:47 IST)

Widgets Magazine

హీరో నానిని హీరోయిన్ నిత్యా మీనన్ ఒరేయ్ అని అనేసింది. హీరో నాని కొత్త చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవి ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
nithya menon
 
మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుగాంచిన హీరో నాని. ఇటీవలే నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని కూడా నిర్మించాడు. ఆ చిత్రం "అ". ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నాని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాలో నటించిన అందరి లుక్‌లను ఒక్కొక్కటిగా విడుదల చేసి సినిమాపై ఆసక్తిని కలిగించాడు. తాజాగా, చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సినిమాలోని నలుగురు అందమైన భామలతో కలిసి ప్రొడ్యూసర్ నాని ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ యాక్టర్స్‌ని మాత్రం పలకరించాను ప్రొడ్యూసర్‌ని ఇంకా పలకరించలేదు అంటూ వ్యాఖ్యానించింది. దీనికి హీరోయిన్ నిత్యామీనన్ 'ఇక్కడ మగవాళ్లెక్కడ ఉన్నారు' అంటూ అమాయకంగా ప్రశ్నించింది. దీంతో నానికి కోపమొచ్చి... కుర్చీలోనుంచి లేవబోయాడు. వెంటనే... 'రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా' అని చెప్పడంతో హీరో కమ్ ప్రొడ్యూసర్ కూల్ అయ్యాడు. 
 
ఇకపోతే, 'ఫిదా' బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన తన తదుపరి చిత్రాన్ని హీరో నానితో తీయనున్నాడు. 'ఫిదా' తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ డైరెక్టర్, ఇటీవల నానికి ఓ యూత్ ఫుల్ స్టోరీని వినిపించాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట నేచురల్ స్టార్.
డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో దూసుకుపోతున్న ఏషియన్ ఫిల్మ్స్ సంస్థ శేఖర్-నాని సినిమాని నిర్మించబోతుంది. 
 
మరోవైపు నాని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడు నాని. నాని నిర్మాతగా వ్యవహరించిన 'అ' చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి తొలిసారి నాని-శేఖర్ కమ్ముల కలయికలో రూపొందే మూవీ ఎలా ఉంటుందో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
నాని అ మూవీ ఫస్ట్ లుక్ శేఖర్ కమ్ముల ఫిదా Nani Aa Movie నిత్యా మీనన్ First Look Nithya Menon

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రియ వారియర్ సైగలకు ఫిదా అయిన బన్నీ.. ఏమన్నాడంటే?

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్ డేను ...

news

మొన్న కనుసైగతో... నేడు లవ్ తుపాకీతో పేల్చిన ప్రియా వారియర్ (Video)

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం ...

news

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం ...

news

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే... (Video)

టాలీవుడ్ హీరో విశాల్ తాజా తమిళ చిత్రం "ఇరుంబుతిరై". విశాల్ ప్రొడక్షన్ ఫిలిం ఫ్యాక్టరీ ఈ ...

Widgets Magazine