మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2015 (12:43 IST)

వీడని సందిగ్ధం... 'రుద్రమ దేవి' రాకకు మరికొంత ఆలస్యం...

దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమ దేవి'. ఎప్పుడో షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుని ఈ సినిమా ఇప్పటి వరకు తెరకెక్కలేదు. అందుకు పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత సినిమా విడుదల సిద్ధమైందనుకుంటున్న తరుణంలో రాజమౌళి 'బాహుబలి' విడుదల తేదీని ప్రకటించారు.
 
మరో భారీ చిత్రంతో పోటీపడితే దెబ్బతగులుతుందని అప్పుడు విడుదల చేయలేదని టాక్ వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు తొలి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారట. అయితే మరో స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా 'శ్రీమంతుడు' విడుదల 'రుద్రమ దేవి'కు అడ్డుకట్ట వేసిందని టాక్. అయితే ఎట్టకేలకు సెప్టెంబర్ నాలుగో తేదిన 'రుద్రమ దేవి'ని విడుదల చేస్తామని గుణశేఖర్ ప్రకటించారు. 
 
ప్రస్తుత తాజా సమాచారం ఏమిటంటే 'రుద్రమ దేవి' విడుదల మళ్లీ వాయిదాపడుతుందని సమాచారం. గత కొన్ని రోజులుగా ఆ చిత్ర యూనిట్ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చేస్తోంది. మరో రెండు వారాల పనులు పెండిగ్‌లో ఉన్నాయట. దీంతో సినిమా విడుదలకు ఆలస్యం ఏర్పడిందని సమచారం. అవి పూర్తి అయిన వెంటనే సెప్టెంబర్ మూడో వారంలో సినిమాను విడుదల చేస్తారని సమాచారం. అనుష్క లీడ్ రోల్‌లో నటిస్తున్న రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్, రానా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.