Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో రోజా... బెదిరింపులకు భయపడేది లేదు: రామ్ గోపాల్ వర్మ

బుధవారం, 11 అక్టోబరు 2017 (09:29 IST)

Widgets Magazine
ramgopal varma

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా నటించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన నిర్మాణ పనులపై చర్చించేందుకు పలమనేరులోని చిత్ర నిర్మాత వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంటికి రామ్ గోపాల్ వర్మ వెళ్లారు. 
 
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. చిత్రంలోని కొన్ని పాత్రలకు సంబంధించి ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాకు కూడా ఇందులో అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, చిత్ర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చైనా వెనుకాడబోమని తెలిపారు. ఎవరి బెదిరింపులకు భయపడకుండా సినిమాను నిర్మిస్తామని తెలిపారు.  
 
రామ్ గోపాల్ వర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఎంట్రీ నుంచి ఈ సినిమా వుంటుందని చెప్పారు. ఇందులో రాజకీయ అజెండా వుండదన్నారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని.. అందులో చాలా చాప్టర్లున్నాయని.. తాను ఒక చాప్టర్‌ను ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి రావడం నుంచి ఆయన మరణం వరకు ఈ చిత్రం వుంటుందని వర్మ స్పష్టం చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'మన్మథుడు'తో నటించడం ప్రాక్టికల్స్ చేసినట్టే : హీరోయిన్ శీరత్ కపూర్

టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటించిన తాజా హారర్ థ్రిల్లర్‌ చిత్రం 'రాజుగారి గది 2'. ఈ ...

news

అందులో లక్ష్మీపార్వతి విషయాలన్నీ వుంటాయ్... వర్మ(వీడియో)

ఇప్పుడు ఎక్కడ చూసినా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. సంచలన ...

news

అభిమానులపై అంతెత్తు లేచిన శర్వానంద్ (వీడియో)

మహానుభావుడు సినిమాలో అతి శుభ్రతతో పాటు అద్భుతమైన యాక్టింగ్‌లో తానేంటో నిరూపించుకున్నారు ...

news

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో రోజాకు చాన్స్ ఇస్తా... వర్మ, జయప్రద క్యారెక్టరా?(వీడియో)

స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో వైసీపీ ...

Widgets Magazine