మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (01:56 IST)

తిరుమలపై మన అవగాహననే మార్చేస్తున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’

నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ తీశాను. ఇప్పుడు ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కూడా అందుకే తీశాం అంటున్నారు దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు. ‘అన్నమయ్య’ కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగ

నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ తీశాను. ఇప్పుడు ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా కూడా అందుకే తీశాం అంటున్నారు దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు. ‘అన్నమయ్య’ కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగార్జున ఈ కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పారు. ఇక, నటన అంటారా అద్భుతం. ఎమోషనల్‌ సన్నివేశాల్లో గ్లిజరిన్‌ అవసరం లేకుండా ఆయనకు కన్నీళ్లు వచ్చేసేవి. అంతగా లీనమైపోయారు  అంటూ చిత్ర విశేషాలు పంచుకున్నారాయన.
 
600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రతో ఈ సినిమా తీశాం. అప్పట్లో తిరుమల ఎలా ఉండేది అని ఊహించి, సెట్స్‌ వేశాం. కొంత గ్రాఫిక్స్‌ వర్క్‌ చేశాం. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు జరిగిన కొన్ని మహిమల గురించి చెబితే, ఆశ్చర్యపోతారు. మేం సెట్స్‌ వేసిన ప్రదేశానికి కొంత దూరంలో భారీగా వర్షం కురిసేది. మా దగ్గర మాత్రం ఉండేది కాదు. వింతగా అనిపించేది. బ్రహ్మోత్సవాల సీన్స్‌ తీసేటప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే, అనుష్క చేసిన దుర్గా దేవి సీన్స్‌ చిత్రీకరణ అప్పుడు దుర్గాష్టమి పండగ. ఇవన్నీ చూసి, నాస్తికులు కూడా ఉంటే ఆస్థికులుగా మారిపోతారేమో అనిపించిందన్నారు దర్శకేంద్రులు
 
ఏడు కొండలు అంటాం కానీ, వాటి ప్రాశస్త్యం గురించి చాలామందికి తెలియదు. అది ఈ సినిమాలో చెప్పాం. ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాం. ఇప్పటివరకూ తిరుమల వెళ్లినవాళ్లు ఈ సినిమా చూశాక వెళితే అక్కడి పరిసర ప్రాంతాలను వేరే దృక్పథంతో చూస్తారు. ‘ఇక్కడ ఇలా జరిగిందా ఇలా ఉండేదా’ అని ఆసక్తిగా చూస్తారు. అలాగే, దేవుణ్ణి చూసే విధానంలో కూడా మార్పొస్తుంది. భక్తి సినిమాలను యూత్‌ కూడా చూస్తున్నారు. తిరుమలకు కాలి నడకన వెళ్లేవాళ్లల్లో యూత్‌ ఎక్కువగా ఉన్నారు. ఎగ్జామ్స్‌ పాస్‌ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో... స్వామివారిని దర్శించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా యూత్‌ ఎంత ముందున్నా.. చరిత్ర కూడా తెలుసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సినిమాల వల్ల అవి తెలుస్తాయి. అవి తెలుస్తాయన్నారు రాఘవేంద్రరావు.