గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (11:51 IST)

గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌ : పాకిస్థాన్ చిత్రాల ప్రదర్శనకు నో

గోవాలో త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో పాకిస్థాన్ సినిమాలను ప్రదర్శించడం లేదు. పాకిస్థాన్ నుంచి వచ్చిన రెండు ఎంట్రీలను తిరస్కరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో ఈ వేడుకలు జరుగనున్నాయ

గోవాలో త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో పాకిస్థాన్ సినిమాలను ప్రదర్శించడం లేదు. పాకిస్థాన్ నుంచి వచ్చిన రెండు ఎంట్రీలను తిరస్కరించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో ఈ వేడుకలు జరుగనున్నాయి. ఈ వివరాలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా వెల్లడించారు. ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శనకుగాను ప్రపంచ వ్యాప్తంగా 1032 ఎంట్రీలు వచ్చినట్టు తెలిపారు. 
 
ఈ ఉత్సవాల సందర్భంగా, మొత్తం 88 థియేటర్లలో 194 సినిమాలను ప్రదర్శించనున్నారు. అయితే పాకిస్థాన్ సినిమాలను ప్రదర్శించడం లేదని స్పష్టం చేశారు. కాగా పాక్ నుంచి ఎంట్రీలు పంపిన సినిమాల పేర్లు గుర్తులేదని, వాటిని తిరస్కరించినట్టు చెప్పారు. యురీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ నటులకు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరాదని చిత్ర నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. పాక్ నటులకు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వబోమని దర్శక, నిర్మాతలు అంటున్నారు.