బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 20 జనవరి 2017 (07:39 IST)

వాళ్లది మాట సాయం.. ఈయనది అన్నం పెట్టే సాయం..

తమిళ చిత్రపరిశ్రమ మొత్తంలో సహాయ గుణం, వితరణ గుణం ఉన్ననటీనటుల్లో రాఘవ లారెన్స్ ఏ అగ్రహీరో కంటే తక్కువ కాదు. తమిళ ప్రజలకు ఇబ్బంది ఎదురైన ప్రతి సందర్భంలోనూ నేనున్నాను అంటూ ముందుకొచ్చే నిజమైన ప్రేమికుడు లారెన్సే అన్నది రుజువైన సత్యం.

తమిళ చిత్రపరిశ్రమ మొత్తంలో సహాయ గుణం, వితరణ గుణం ఉన్ననటీనటుల్లో రాఘవ లారెన్స్ ఏ అగ్రహీరో కంటే తక్కువ  కాదు. తమిళ ప్రజలకు ఇబ్బంది ఎదురైన ప్రతి సందర్భంలోనూ నేనున్నాను అంటూ ముందుకొచ్చే నిజమైన ప్రేమికుడు లారెన్సే అన్నది రుజువైన సత్యం. యధాప్రకారం ఈ సారి కూడా లారెన్స్ చిన్న వాడైనా దొడ్డగుణం ప్రదర్శించాడు.

తమిళనాడులో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న జల్లికట్టు ఆచారంపై సుప్రీంకోర్టు నిషేధానికి నిరసన తెలుపుతూ వేలాది ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా చెన్నయ్ లోని మెరీనా బీచ్‌కి తరలి వచ్చారు. గత మూడు రోజులుగా వీరు రాత్రింబవళ్లూ బీచ్ లోనే ఉండి జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ మౌన ప్రదర్శన చేస్తున్నారు.
 
తమిళ సినీ పరిశ్రమ అగ్రహీరోలు రజనీకాంత్, కమల్ హసన్, సూర్య, విజయ్ తదితరులు మాట సాయానికి మాత్రమే పరిమితమై నిరసనకారులకు మద్దతు తెలిపారు. అంటే  వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతే తప్ప వీరిలో ఓ ఒక్కరైనా భారీస్థాయిలో గుమికూడిన జనానికి సహాయంగా ఎలాంటి ద్రవ్యపరమైన సహాయం చేస్తున్నట్లు ప్రకటించలేదు. అగ్రహీరోలందరి దొడ్డ హృదయాలు కేవలం మాటసాయం వరకు మాత్రమే మిగిలిపోయాయి. 
 
మిగతా చిత్రసీమ ప్రముఖులకు, తనకు తేడా అక్కడే ఉందని లారెన్స్ అడుగడుగున్నా నిరూపంచుకుంటూనే వస్తున్నాడు. ప్రజల సహాయార్థం ఎన్ని చారిటీ పనులు తను చేశాడో మొత్తం తమిళనాడుకే తెలుసు. అంగవైకల్యం, బుద్ధి మాంద్యం కలిగిన అనాధ పిల్లలకోసం లారెన్స్ ప్రత్యేకంగా ఒక చారిటీ సంస్థను నడుపుతున్నాడు. అవసరమైన వారికి ఆర్థిక పరంగా సహాయం చేసే గుణాన్ని లారెన్స్ ప్రతిసారీ ప్రదర్శిస్తూ వస్తున్నాడు. 
 
ఈసారి కూడా జల్లికట్టుపై నిషేధానికి వ్యతిరేకంగా గత రెండురోజులుగా చెన్నయ్ మెరీనా బీచ్‌లో ప్రదర్సనలు చేస్తున్న వేలాద మందికి ఆహారం, మందుల సరఫరా కోసం లారెన్స్ కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు. మాటల్లో మద్దతు తెలిపి సైలెంటుగా ఉండిపోయిన అగ్రహీరోలతో పోలిస్తే రాఘవ లారెన్స్ చేసిన సహజ వితరణను మాటల్లో కొలువగలమా? అందుకే లారెన్స్ ప్రతి సందర్భం లోనూ ప్రజల హృదయాలను గెల్చుకుంటూనే ఉన్నాడు.