Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేతిరెడ్డిని విమర్శిస్తూ.. వర్మ షార్ట్ ఫిల్మ్..(video)

శుక్రవారం, 10 నవంబరు 2017 (09:30 IST)

Widgets Magazine

దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా మూడు బయోపిక్‌లు తెరకెక్కనున్నాయి. అందులో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటైతే, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిది రెండోది కాగా, బాలయ్య తీసేది మూడో బయోపిక్ అవుతుంది.

ఈ నేపథ్యంలో కేతిరెడ్డి- రామ్ గోపాల్ వర్మల మధ్య ఎన్టీఆర్ బయోపిక్‌పై పెద్ద వారే జరుగుతోంది. ఇందులో భాగంగా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిని విమర్శిస్తూ రాంగోపాల్ వర్మ తయారు చేసిన వ్యంగ్య షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
లక్ష్మీ పార్వతి నిద్రిస్తుండగా వచ్చిన ఎన్టీఆర్ ఆత్మ తొలుత ఆమెకు సందేశమిచ్చి.. ఆపై కేతిరెడ్డి కలలోకి వచ్చి వెన్నంటి ఉన్నానని చెప్పడం ఈ వీడియోలో స్పెషల్. "లక్ష్మీ పార్వతిగారూ..." అంటూ ఆమెను నిద్రలేపే ఎన్టీఆర్ ఆత్మ, "ఏం... ఏమది? మా మానసిక ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంటే, మీరు ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నారు? లేవండి... లేచి మా మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఆచరించండి. 
 
మాకు అభిమానపాత్రుడు చిరంజీవి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గారు, మా మీదగల అపారమైన గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో మామీద చలనచిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. సత్సంకల్పంతో ఇంతటి బృహత్తర కార్యాన్ని తలపెట్టారు. దాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించడం అవివేకమంటూ పలుకుతుంది. అదే ఆత్మ కేతిరెడ్డిని కూడా తట్టి లేపి సందేశమిస్తుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతలో ఇంత మార్పు ఊహించలేదు... నాగార్జున

నాగ చైతన్యతో కలిసి సమంత ఇంటికి వచ్చింది. నాగ్ సర్... మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. ...

news

అదిరింది రివ్యూ రిపోర్ట్.. విజయ్, నిత్య అదరగొట్టేశారు.. ఆ సీన్స్‌కు కత్తెర

రూ.5లకే వైద్యం అందించే భార్గవ్ (విజయ్)కు అవార్డు అందించేందుకు విదేశాల నుంచి పిలుపు ...

news

క్రికెటర్ ద్రావిడ్‌ను ప్రేమించానంటున్నట్టు దేవసేన

భారత క్రికెట్ జట్టులో 'ది వాల్‌'గా పేరుగాంచిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్‌ను అమితంగా ...

news

వరుణ్ ధావన్‌కు చుక్కలు చూపించిన యువతి

బాలీవుడ్ యంగ్ నటుడు వరుణ్ ధావన్‌కు ఓ యువతి చుక్కలు చూపించింది. ప్రతిరోజూ ఆమెకు మెసేజ్‌లు ...

Widgets Magazine