గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 6 మే 2017 (11:17 IST)

పెళ్లిచూపులు టీమ్‌కు కేసీఆర్ అభినందనలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్‌ను చంపేశారు..!

పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంభాషణలకు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఎంపిక కావడంతో పాటు అవార్డును అంద

పెళ్లిచూపులు చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్ ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ సంభాషణలకు, ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఎంపిక కావడంతో పాటు అవార్డును అందుకున్న పెళ్ళిచూపులు సినీ బృందానికి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఎమ్యెల్యే వినయభాస్కర్ ఆధ్వర్యంలో తరుణ్ భాస్కర్ తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. చిత్ర బృందాన్ని అభినందించిన కేసీఆర్, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
 
ఇదిలా ఉంటే, చిన్న బడ్జెట్‌తో రిలీజైన 'పెళ్లిచూపులు' సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా, ఉత్తమ సంభాషణ చిత్రంగా అవార్డు కైవసం చేసుకుంది. అంతా బాగున్నప్పటికీ ఆ దర్శకుడికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆ మధ్య ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రానికి అవార్డు ప్రకటించిన నేపథ్యంలో తరుణ్ కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్‌ని టార్గెట్ చేశారు. 
 
దీంతో కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలకు మండిపడి అతడు చనిపోయినట్లుగా చిత్రీకరించేశారు. ఏకంగా వికీపీడియా‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేసారో లేక మరెవరైనా ఇలా చేశారేమో కానీ మొత్తానికి తరుణ్‌ని ఇబ్బంది పెట్టారు.
 
కాగా... గతంలో టీఆర్పీ కోసమే 'జనతా గ్యారేజ్'కు అవార్డు ఇచ్చారని తరుణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరుణ్ భాస్కర్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. ఒక్క హిట్టుకే ఇంత పొగరా.. మా ఎన్టీఆర్‌ను అంటావా అంటూ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా తరుణ్ భాస్కర్ వికీపీడియా పేజీలోకెళ్లి.. తరుణ్ చనిపోయినట్లుగా ఎడిట్ చేసి.. స్క్రీన్ సేవర్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు పరిస్థితి తీవ్రతను గమనించిన తరుణ్ ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెబుతూ.. ఓ లెంగ్తీ ఫేస్ బుక్ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.