Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నకు హిట్ దక్కాలని తమ్ముడి తహతహ...

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (11:50 IST)

Widgets Magazine
kalyanram - jr ntr

సాధారణంగా తెలుగు చిత్రపరిశ్రమలో అన్నాదమ్ములైనా, అక్కాచెల్లెళ్లైనా ఒకరికొకరు పోటీ వస్తున్నారంటే అస్సలు ఓర్వలేరు. సినిపరిశ్రమ ఒక్కటే కాదు. ఏ రంగమైనా ఇలాంటి పోటీనే కనిపిస్తుంది. కానీ తన అన్న సినిమాలు బాగా ఆడకపోవడం.. చివరకు నిర్మాతగా మారి సినిమాలు తీసుకోవడం తమ్ముడికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే అన్నకు క్రేజ్ తెప్పించేందుకు తమ్ముడు తన క్రేజ్‌ను ఫణంగా పెట్టేందుకు ఓ అగ్ర హీరో సిద్ధమయ్యాడు. ఇంతకీ ఎవరా అన్నాదమ్ముళ్లు అనుకుంటున్నారా... ఎవరా అగ్రహీరో అంటే.. వారెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. 
 
వరుస ఫ్లాప్‌లతో సినిమాలకు దూరమై తన సొంత బ్యానర్‌లో కళ్యాణ్‌ రామ్ సినిమాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ మధ్య ఎమ్మెల్యే, నా నువ్వే సినిమాల్లో కళ్యాణ్‌‌కు అవకాశం రావడం అందులో ప్రముఖ హీరోయిన్లు నటిస్తుండటంతో ఆ సినిమాపై కళ్యాణ్‌ రామ్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. అంతటితో ఆగలేదు. 
 
తన సినిమా హిట్టవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ కావాలని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణల సహాయం కూడా తీసుకోనున్నారు కళ్యాణ్‌ రామ్. తన సినిమాలో వీరిద్దరూ నటిస్తే ఖచ్చితంగా అభిమానులు ఎగబడి చూస్తారు.. అప్పుడు భారీ హిట్ దిశగా సినిమా దూసుకెళుతుందన్నది కళ్యాణ్‌ రామ్ ఆలోచనగా ఉంది. 
 
మరోవైపు, కళ్యాణ్‌ రామ్‌ను తెలుగు సినీపరిశ్రమలో నిలదొక్కుకునేలా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి సిద్ధమని చెప్పారట. అంతేకాదు తండ్రి హరికృష్ణను కూడా ఎన్టీఆర్ ఒప్పించారట. ఇప్పుడు వీరు ముగ్గురు కలిసి నటించే సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తెలుగు, తమిళ బాషల్లో అవకాశాలురాని హాట్ హీరోయిన్.. ఎవరు?

రెజీనా క‌సాండ్రా... ఈమె గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. తెలుగు సినీపరిశ్రమలో పాత, కొత్త ...

news

ఆ పెళ్ళి పత్రికను జాగ్రత్తగా దాచుకున్న మెగాస్టార్.. ఎందుకో తెలుసా...

ఎంత పెద్ద ప్రముఖుడైనా తనకు సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తగా దాచుకోవాలని భావిస్తాడు. ...

news

పద్మావతి అంటే ఇష్టం.. ప్రియా ప్రకాష్ వారియర్

బాలీవుడ్‌లో షారూఖ్ ఖాన్‌తో పాటు రణ్‌వీర్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి హీరోలంటే చాలా ...

news

విజయ నిర్మల @ 73... పుట్టినరోజు శుభాకాంక్షలు...

నటి, దర్శకురాలు విజయ నిర్మల 73వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాదులోని ఆమె స్వగృహంలో ఘనంగా ...

Widgets Magazine