Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ సినిమాలో ముగ్గురు భామలు.. రాశిఖన్నా ఓకే.. కాజల్-తమన్నాలను కూడా సెలెక్ట్ చేశారా?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (13:28 IST)

Widgets Magazine

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా హీరోయిన్ కోసం దర్శక, నిర్మాతలు వేట కొనసాగించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాకు కన్ఫామ్ అయ్యారని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. 
 
అయితే సినిమా పూజకి రాశీ ఖన్నా మాత్రమే విచ్చేయడంతో మిగతా ఇద్దరు ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదు. ఈ సినిమాలో రాశికి తోడు ఇద్దరు సీనియర్ భామలను రంగంలోకి దించేందుకు పక్కా ప్లాన్ జరుగుతుందని తెలుస్తోంది.  
 
ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మరో పాత్రలో బాహుబలి అవంతిక.. తమన్నాను ఖరారు చేసినట్లు సమాచారం. ఒకేసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయనున్న యంగ్ టైగర్ ట్రిపుల్ రోల్‌లో ఏ స్థాయిలో మెప్పిస్తాడోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్రుతతో వేచి చూస్తున్నారు. ఇప్పటికే కాజల్, తమన్నాలతో నిర్మాత కళ్యాణ్ రామ్ సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రకుల్ ప్రీత్ సింగ్ "పరేశానురా సాంగ్‌"కు యూట్యూబ్‌లో మంచి క్రేజ్.. ఆకట్టుకున్న స్కిన్ షో..

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ...

news

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున ...

news

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం ...

news

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?

బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో ...

Widgets Magazine