Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"ఓం నమో వేంకటేశాయ" కోసం గడ్డం పెంచి.. భక్తి శ్రద్ధలతో నటించారు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయ్

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:56 IST)

Widgets Magazine
nagarjuna in om namo venkatesaya

అన్నమయ్య, రామదాసు వంటి భక్తిరస చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఇదే కోవలోనే "ఓం నమో వేంకటేశాయ"  చిత్రంలో నటిస్తున్నారు. అన్నమయ్య తన సంకీర్తనలతో శ్రీవారిని ప్రసన్నుడిని చేసుకుంటే, రామదాసు తన భక్తి ప్రపత్తులతో దైవాన్ని తన వాడుగా చేసుకున్నాడు. తాజాగా హథీరామ్ బాబా కూడా శ్రీ వేంకటేశ్వర స్వామిని తన స్నేహంతో కట్టివేస్తాడు. ఈ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. 
 
ఈ సినిమా గురించి నిర్మాత మహేశ్ రెడ్డి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలిపారు. శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో 'శిరిడిసాయి' తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మహాభక్తుడైన హథీరామ్‌ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించానని చెప్పుకొచ్చారు. తనకు భక్తిరస చిత్రాలను తెరకెక్కించేందుకు సాయపడిన రాఘవేంద్ర రావు, నాగార్జున గారికి రుణపడి ఉంటానని మహేష్ రెడ్డి తెలిపారు. 'శిరిడి సాయి' తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో మహేష్ రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' ఈ నెల 10న రిలీజవుతోంది. 
 
శ్రీవారి సేవల గురించి.. పూజల గురించి వాటి విశిష్ఠత గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశామన్నారు. 'ఓం నమో వేంకటేశాయ' అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్‌ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగిందని మహేష్ రెడ్డి వెల్లడించారు. కమర్షియల్ చిత్రాలు చేస్తూ భక్తిరస చిత్రాల్లో నటించే నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడం మా అదృష్టమని.. భక్తి శ్రద్ధలతో గడ్డం పెంచి నాగార్జున ఈ  సినిమాలో నటించారని చెప్పారు. తెరపై నాగార్జునను చూడగానే భక్తి భావంతో తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని నిర్మాత చెప్పుకొచ్చారు. 
 
ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాఘవేంద్ర రావు, సౌరభ్, నాగార్జున, విమలా రామన్, ప్రగ్యా జైశ్వాల్, అనుష్క తదితరులు నటించిన ఈ చిత్రం తప్పకుండా ఆయా పాత్రధారులకు మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని నిర్మాత వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''కాటమరాయుడు''కి కలెక్షన్ల కష్టాలు తప్పవా? బుల్లితెరకు.. వీరుడొక్కడేకు లింకేంటి?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో బ్లాక్ ...

news

''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' ట్రైలర్ రిలీజ్.. ట్రెండింగ్‌లో 4వ స్థానం.. 2లక్షల వ్యూస్.. (Video)

రాజ్ తరుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా ట్రైలర్ ...

news

చిరంజీవి, పవన్ సమవుజ్జీలు- మల్టీస్టారర్‌లో ఆ కోణం లేదు: ఎంపీ సుబ్బరామిరెడ్డి

దేశ సినీ చరిత్రలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న అన్నదమ్ములు లేరని, ఇమేజ్‌లో చిరంజీవి, పవన్‌ ...

news

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పేరేంటి? జూన్ 23వ తేదీన రిలీజ్? ప్రిన్స్ Vs అజిత్?

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ ...

Widgets Magazine