బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (16:26 IST)

బెంగుళూరులో విజువల్స్ ఎఫెక్ట్స్ చేసిన చిత్రానికి ఆస్కార్... బెస్ట్ చిత్రంగా మూన్‌లైట్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున అం

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 89వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్‌ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తమ చిత్రం ప్రకటనలో తొలుత పొరపాటు దొర్లినా ఆ పొరపాటును వెంటనే సవరించుకుని 'మూన్‌లైట్' చిత్రాన్ని ఆస్కార్ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. 
 
ముఖ్యంగా భారతీయ చిత్రాల్లో ఒక్కదానికి కూడా ఆస్కార్ ఆవార్డు దక్కకపోయినప్పటికీ.. బెంగుళూరులో విజువల్ ఎఫెక్ట్స్ చేసిన 'ది జంగిల్ బుక్' చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ విభాగంలో ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ చిత్రం భారత్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. 
 
ఇకపోతే ఆస్కార్ ఉత్తమ నటుడుగా కసే ఎఫ్లేక్ (మాంచెస్టర్ బై ద సీ), ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్ (లా లా ల్యాండ్) ఎన్నికయ్యారు. ఉత్తమ సహాయనటిగా వివోలా డేవిస్ (ఫెన్సెస్), ఉత్తమ సహాయనటుడిగా మహేర్షల అలీ (మూన్‌లైట్) ఎన్నికయ్యారు. ఉత్తమ దర్శకుడి అవార్డు డేవియన్ చాజెల్ (లా లా ల్యాండ్)ను వరించింది.
 
అలాగే, ఉత్తమ విదేశీ చిత్రంగా ఇరాన్‌కు చెందిన 'సేల్స్‌మ్యాన్' ఎన్నికైంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా 'సిటీ ఆఫ్ స్టార్స్' (లా లా ల్యాండ్), ఉ్తతమ ఒరిజినల్ స్కోర్ 'లాలా ల్యాండ్' దక్కించుకున్నాయి. ఉత్తమ ఛాయాగ్రహణం లినస్ శాన్‌గ్రెన్ (లాలా ల్యాండ్), ఉత్తమ లైవ్ యాక్షన్ పార్ట్ - క్రిస్టిన్ డీక్, అన్నా యుడ్వర్డీ (సింగ్), ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రంగా 'ది వైట్ హెల్మెట్స్', ఉత్తమ ఎడిటింగ్ హాక్సా రిడ్జ్ (జాన్ గిల్టర్ట్), ఉత్తమ ఎడిటింగ్ హాక్సా రిడ్జ్ (జాన్ గిల్బర్ట్స్) ఎంపికయ్యారు. 
 
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ 'ది జంగిల్ బుక్' దక్కించుకుంది. యానిమేటెడ్ ఫీచర్ చిత్రంగా జుటోపియా (బైరైన్ హోవర్డ్, రిచ్ మూరే, క్లార్క్ స్పెన్సర్) ఎంపికైంది. సౌండ్ మిక్సింగ్ - హాక్సా రిడ్జ్, సౌండ్ ఎడిటింగ్ - అరైవల్ (బెల్లీమూర్), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ - ఒ.జె. మేడ్ ఇన్ ఎమెరికా (ఎజ్రా ఎడిల్ మ్యాన్, కరోలైన్ వాటర్లో), ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైన్ - పెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టూ ఫైండ్ దెమ్ (కొలెన్ ఎట్ఉడ్), ఉత్తమ అలంకరణ - సుసైడ్ స్క్వాడ్ (అల్సాండ్రో బెర్టాల్జీ, జిర్డోయో గెగ్రేయిన్ క్రిస్పోటర్ నీల్సన్) దక్కించుకున్నాయి.