Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు" అంటున్న హీరోయిన్

బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (17:22 IST)

Widgets Magazine
lavanya tripathi

పదహారణాల తెలుగు అమ్మాయి నుంచి టూ పీస్ బికినీ గర్ల్‌గా మారినప్పటికీ ఫలితం దక్కలేదని టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వాపోతోంది. 'సోగ్గాడే చిన్ననాయనా' చిత్రం తర్వాత ఓ మంచి హిట్ కోసం ఆ భామ పరితపిస్తోంది. ఇందుకోసం తన అందాల అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాలను ప్రయోగించింది. ఇందుకోసం శృంగార డోస్ కూడా పెంచింది. అయినప్పటికీ ఫలితం దక్కలేదని వాపోతోంది. 
 
నిజానికి ఈ భామ వెండితెర అరంగేట్రం చేసిన కొత్తల్లో ఈమె నటించిన ప్రతి చిత్రం విజయాన్ని అందుకుంది. కానీ ఈ మధ్య వరుస పరాజయాలతో అమ్మడు డీలా పడిపోయింది. విజయం కోసం ఇప్పటివరకూ తన అందాల అమ్ముల పొదిలో ఉన్న అన్ని అస్త్రాల్ని ప్రయోగించింది. కానీ లాభం లేకపోయింది. ఆఖరికి తాజా చిత్రమైన 'ఇంటిలిజెంట్' కూడా ఆమెను పరాజయం బారి నుంచి తప్పించలేకపోయింది. 
 
గత యేడాది 'మిస్టర్'తో లావణ్య పరాజయాల ఖాతను తెరిచింది. ఆ తర్వాత వరుసగా 'యుద్ధం శరణం', 'రాధ', 'ఉన్నది ఒకటే జిందగీ'లాంటి సినిమాలన్నీ పూర్తిగా నిరాశపరచడంతో సాయిధరమ్ తేజ, వి.వి.వినాయక్ కాంబో మూవీ 'ఇంటిలిజెంట్' మీదే అన్ని ఆశలూ పెట్టుకుంది. అయితే ఆమె ఆశలన్నీ వమ్ము చేసి 'ఇంటిలిజెంట్' కూడా పరాజయాల లిస్ట్‌లోకి చేరిపోవడంతో లావణ్య ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్‌లో పడింది. 
 
ఈ అమ్మడు ఆది నుంచి తన అందం, అభినయంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. కానీ, వరుస పరాజయాలు పలకరించడంతో అందాల ఆరబోతలోకి కూడా దిగింది. ఇందులోభాగంగా, 'ఇంటిలిజెంట్' చిత్రం కోసం శృంగార డోస్‌ను మరింతగా పెంచింది. అయినా సరే సక్సెస్ మాత్రం దక్కలేదు. అంటే ఆమె పరిస్థితి "వ్రతం చెడ్డా ఫలితం దక్కలేద"న్నమాట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
లావన్య త్రిపాఠి శృంగారం ఎక్స్‌పోజింగ్ ఇంటెలిజెంట్ మూవీ Lavanya Tripathi Over Exposing Not Working Inttelligent Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

'రేయ్ నువ్వు కాదురా.. యాక్టర్స్ రా'... హీరోను అలా అనేసి నిత్యామీనన్

హీరో నానిని హీరోయిన్ నిత్యా మీనన్ ఒరేయ్ అని అనేసింది. హీరో నాని కొత్త చిత్రం ప్రమోషన్‌లో ...

news

ప్రియ వారియర్ సైగలకు ఫిదా అయిన బన్నీ.. ఏమన్నాడంటే?

''ప్రియ వారియర్'' సైగలే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాలెంటైన్ డేను ...

news

మొన్న కనుసైగతో... నేడు లవ్ తుపాకీతో పేల్చిన ప్రియా వారియర్ (Video)

మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈమె వెండితెర అరంగేట్రం ...

news

కోలీవుడ్‌లో కలకలం.. కె.బాలంచదర్ ఆస్తుల వేలం?

తమిళ చిత్రపరిశ్రమలో ఓ వార్త కలకలం రేపుతోంది. దర్శకశిఖరం కె.బాలచందర్ ఆస్తులు వేలం ...

Widgets Magazine