Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపిక తలకు రూ.10కోట్లు.. జీఎస్టీ కలిపారా? లేదా?: ట్వింకిల్ ప్రశ్న

మంగళవారం, 21 నవంబరు 2017 (10:31 IST)

Widgets Magazine

పద్మావతి సినిమా విడుదల నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ స్వచ్ఛందంగా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అయితే సినిమాను నిషేధించాల్సిందేనంటూ కర్ణిసేన ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇంకా సంజయ్‌ లీలా బన్సాలీ 'పద్మావతి' చిత్ర వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ, హీరోయిన్‌ దీపికా పదుకొనేలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ‘పద్మావతి’ చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి, హీరోయిన్ దీపికా పదుకొనే తలలు తెస్తే 10 కోట్ల రూపాయల నజరానా ఇస్తామని బీజేపీ నేత సూరజ్ పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ షోకాజ్ నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు అక్షయ్ కుమార్ భార్య, నటి, రచయిత్రి ట్వింకిల్ ఖన్నా భాటియా స్పందించింది.
 
ఇంతకీ సూరజ్ పాల్ ప్రకటించిన రూ.పది కోట్ల రూపాయలకు జీఎస్టీ కలిపే ప్రకటించారా, లేక జీఎస్టీ మినహాయించి ప్రకటించారా? దేశం తెలుసుకోవాలనుకుంటోంది? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్‌లో ఈ సినిమా కనీవినీ ఎరుగని విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బట్టల వ్యాపారంలోకి సన్నీ లియోన్

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీ లియోన్. ఒక్క బాలీవుడ్‌కే ...

news

కొడకా.. కోటేశ్వరా అంటున్న పవన్.. ఎందుకు?

అత్తారింటికి దారేది సినిమాలో కాటమరాయుడు సాంగ్‌తో గొంతు సవరించుకున్న పవర్ స్టార్ పవన్ ...

news

ఇవాంకాను సన్నీలియోన్‌తో పోల్చిన రామ్ గోపాల్ వర్మ (వీడియో)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాదులో పర్యటించనున్న సంగతి ...

news

శింబు, త్రిష, వడివేలుపై నిర్మాతల మండలి యాక్షన్?

కోలీవుడ్ సినీ పరిశ్రమలో శింబు, త్రిష, వడివేలు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. వీరిపై కఠిన ...

Widgets Magazine