గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 2 జులై 2016 (14:36 IST)

పరిణీతి చోప్రాకు హాలీవుడ్ ఆఫర్.. ప్రియాంక, దీపికాల తర్వాత పరిణీతి కూడా?!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రాకు హాలీవుడ్ ఛాన్సొచ్చింది. అయితే హాలీవుడ్ ఛాన్సులో అమ్మడు నటించడం చేయట్లేదు. ఆమె వాయిస్ ఇచ్చే అవ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- మురుగదాస్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణితి చోప్రాకు హాలీవుడ్ ఛాన్సొచ్చింది. అయితే హాలీవుడ్ ఛాన్సులో అమ్మడు నటించడం చేయట్లేదు. ఆమె వాయిస్ ఇచ్చే అవకాశాన్ని సొంతం చేసుకుంది. తద్వారా పరిణీతి వాయిస్ స్పీల్ బర్గ్ తీసిన సినిమాలో వినిపించబోతోంది. 
 
ఆస్కార్ అవార్డు గ్రహీత స్టీవెన్ స్పీల్ బర్గ్ 'ద బీఎఫ్‌జీ' (ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్) సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు హిందీ డబ్బింగ్‌కు పరిణీతి చోప్రాను సంప్రదించినట్లు తెలిసింది. అందుకు పరిణీతి కూడా ఓకే చెప్పేసిందని బిటౌన్ వర్గాల సమాచారం. 
 
ఇప్పటికే బాలీవుడ్ కథానాయికలు ప్రియాంక చోప్రా, దీపిక పదుకునేలు హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశాలను కైవసం చేసుకున్నారు. అయితే ప్రియాంక చోప్రాలా కాకుండా డబ్బింగ్ రూపంలోనైనా హాలీవుడ్ కంట పడాలని పరిణీతి భావిస్తోంది. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో 'తకథమ్' అనే సినిమాలో పరిణీతి చోప్రా నటిస్తోంది.