Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవే హీరో నేను కాదు : 'కాటమరాయుడు'లో పవన్‌

శనివారం, 18 మార్చి 2017 (22:55 IST)

Widgets Magazine
pawan kalyan

''ఫంక్షన్‌లకు వెళ్ళాలంటే భయమేసేది. ఎందుకంటే చిరంజీవిగారే హీరో.. నేను కాదు... నేను చేసిన సినిమా సమయంలో థియేటర్లకు వెళ్ళాలంటే బెరుకుగా వుండేవి. కామ్‌గా వుంటే పొగరు అనుకునేవారు. డిస్ట్రిబ్యూటర్లు వచ్చి రోడ్డుమీద ఊరేగింపుగా తీసుకెళతామన్నారు. అలా చేయాలంటే అన్నయ్య అయితే బాగుంటుంది. నన్ను బలిపశువు చేయవద్దని చెప్పాను. కానీ బయట జనాలు చూస్తే.. వారు ప్రేమతో చేతులు ఊపడంతో ఆశ్చర్యపోయానని'' పవన్‌ కళ్యాన్‌ అన్నారు.
 
కాటమరాయుడు ప్రీ-ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. పలు విషయాలను చర్చించారు. కాసేపు తను చేసిన సినిమా కథల నేపథ్యాన్ని వివరిస్తూ.. మరోవైపు తల్లిదండ్రులను గుర్తుచేసుకుంటూ.. మరోవైపు సమాజాన్ని స్టడీ చేసిన వ్యక్తిగా మాట్లాడారు. తన తండ్రి చెప్పిన మాటలు.. ప్రతిధ్వనించాయంటూ.. సృష్టిలో అందరూ సమానమే. నువ్వు ఎక్కువకాదు అన్నారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు నన్ను అభిమానించేవారికి, జీవం వున్న వస్తువుకి శిరస్సు వంచి మొక్కుతున్నానని తెలిపారు.
 
నేను మీకు నచ్చాలని సినిమా తీశాను. నచ్చకపోతే చెప్పండి... ఈ కథ 'వీరం' అనే తమిళ సినిమాది. దాన్ని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌తో ఆకుల శివ కథ రాశారు. దర్శకుడు డాలీలో సున్నితమైన హాస్యం నచ్చిందని తీసుకున్నామని తెలిపారు. ఇంకా మాట్లాడుతూ... చాలామంది అభిమానులు రాలేకపోయారు. 25 వేల మంది పట్టే సభ కాబట్టి.. రాని ప్రతి ఒక్క అభిమానికి క్షమాపణ తెలుపుకుంటున్నా. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఏవైనా దెబ్బలు తగిలితే నేను బాధపడతాను. ఆడపడుచులకు, యువ శక్తికి ధన్యవాదాలు.
 
అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. టెక్నీషియన్‌ అవుతాననికున్నా.. కానీ హీరో అయ్యాను. తోట పనికావచ్చు. వీధులు ఊడ్చే పనికావచ్చు.. ఎలాంటి పనినైనా నిస్సిగ్గుగా గర్వంగా పనిచేస్తాను. సినిమాలు భగవంతుడు ఇచ్చిన భిక్ష.. అనుకుని ఒళ్లు దగ్గరపెట్టుకుని చేశాను. భవిష్యత్‌లో ఎలాంటి బాధ్యతలు పెట్టినా అలానే చేస్తానన్నారు.
 
అయితే... ప్రజాక్షేమం కావాలంటే అధికారం అంతిమ లక్ష్యం కాదు.. జరిగిందా! మంచితే.. జరగలేదా.. ఇంకా మంచిదే.. అనుకునేవాడిని అని వివరించారు. ఇక తను చేసిన ప్రతి సినిమాను విశ్లేషిస్తూ... జల్సా, అతడు.. సినిమాలకు త్రివిక్రమ్‌తో పరిచయం అయిందనుకుంటాను. ఆయన పోసానికి అసిస్టెంట్‌గా తెలుసు. ప్రతి సినిమాల్లో జీవితంలో నేర్చుకున్నవి వచ్చేవి. రెండో సినిమా గోకులంలో సీతలో డైలాగ్‌.. ఒకడు తప్పుదారికి వెళ్ళిపోయి ప్రేమ గుర్తించి సన్మార్గంలో పడతాడు. అలాంటి పాత్ర. చాలా సందర్భాల్లో  ప్రేమే దైవం. ప్రేమే సర్వం. ప్రేమే సృస్టికి మూలం.. అనే మాటలు త్రివిక్రమ్‌ రాసింది గుర్తిండిపోయాయి. అందులో బలమైన భావం వుంది అని చెప్పారు. 
 
అలాగే సుస్వాగతంలో.. చదువు బాధ్యతలు వదిలేసి ప్రేమ అంటూ వెంటపడే యువకుడిగా నటించాను. ఆ సినిమాలో పాత్ర క్లైమాక్స్‌లో ఏడ్వాలి. 40 సార్లు ఏడ్చాను. ఎందుకంటే ఆ భావాన్ని ఆకళింపు చేసుకోలేకపోయాను. నా తండ్రి చనిపోతే ఎలా వుంటుందనేది ఫీలయి ఏడ్చాను. జల్సా టైంలో నాన్న చనిపోతే ఏడుపురాలేదు.. ఎందుకంటే  అప్పటికే నేనే ఏడ్చేశాను. 
 
తొలిప్రేమ.. సినిమా నుంచి తీసుకుంటే.. ప్రతీదీ నాలోని భావాలే సినిమాలకు ప్రతిరూపంగా వచ్చాయి. తమ్ముడు సినిమాలో మార్షల్‌ ఆర్ట్స్‌ ఎప్పుడో నేర్చుకుంది చేయాల్సి వచ్చింది. పిచ్చి ఉన్మాదంతో చేశానని పేర్కొన్నారు. తమ్ముడు సినిమా... భవిష్యత్‌ను నిర్మించుకునేది మనమే.. నీవల్ల కాదు అనేది చెప్పడానికి ఎవరు? అనేది చెప్పడానికి నిదర్శనం తమ్ముడు సినిమా. నన్ను హద్దులు గీసేది ఎవరు? ప్రతి యువతీ, యువకుడు.. మన భవిష్యత్‌ రాయగలిగేది.. మనమే.. అది గుర్తించినప్పుడు నేననుకున్నంత ఎదుగుతాను.. మీరనుకున్నట్లు కాదు.. ఆలోచన విస్తృతి పెంచుకుంటాను అంటూ వ్యాఖ్యానించారు.
 
బద్రిలో.. డైలాగ్‌లు బాగున్నాయి. కథ ప్రకారం.. ఎదిగే ప్రతి ఒక్కడినీ నొక్కేయాలనుకుంటారు.. అందరం మనుషులమే.. నువ్వు మాలాంటి సామాన్యుడివే.. గొప్పవాడివి కావు.. నువ్వు నందా అయితే.. నేను బద్రినాద్‌.. అని చెప్పడానికి అదే కారణం. ఖుషి సినిమాలో... దేశాన్ని ఎంత ప్రేమించాలి.. అనేది చెప్పదలిచాను. 'ఏ మేరా జహా...'. దేశం గురించి చెప్పాను.
 
ఖుషి సినిమాను హైదరాబాద్‌లో చూస్తుంటే.. కీడు శంకించింది. ఏదో జరగబోతుందనిపించింది... ఆ రోజు కోల్పోయిన శక్తి.. గబ్బర్‌ సింగ్‌లో కానీ తెచ్చుకోలేకపోయాను. రోజూ భగవంతుని ముందు మోకరిల్లి శక్తినివ్వమని అడిగేవాడిని.. గెలుపు ఓటములను సమానంగా తీసుకునేలా శక్తి వచ్చింది. మొన్న హార్వర్డ్‌లో మాట్లాడుతుండగా.. మీలో వుండే భగవంతుని శక్తికి మోకరిల్లుతున్నాని చెప్పానంటే అది నిజం కాబట్టి అంటూ ముగించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వపన్‌ భగత్‌సింగ్‌... బండ్ల గణేష్‌: నిజాయితీపరుడు... టీవీ 9 రవిప్రకాష్‌, ముఖ్యమంత్రి కావాలా?

'కాటమరాయుడు' ఆడియో ప్రి-రిలీజ్‌ ఫంక్షన్‌ శనివారం శిల్పకళావేదికలో జరిగింది. ఆదిత్య ...

news

ఆ చిత్రంలోని ఆ ఒక్క పాటకే 15 కోట్ల వ్యూస్... మరి బాహుబలి సంగతేంటి? (Video)

ఇపుడు కొత్త చిత్రాల ప్రచారం ఎక్కువగా సోషల్ మీడియా లేదా యూట్యూబ్ ద్వారానే జరుగుతోంది. ...

news

'ఉయ్యలవాడ నర్సింహా రెడ్డి' ఫస్ట్‌లుక్‌ ఇదే.. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రంగా ఉయ్యలవాడ నరసింహా రెడ్డిలో నటించనున్నారు. దాదాపు ...

news

పూరీ జగన్నాథ్‌కు ఏమైంది.. ఆయనకు నేను పనికిరానా? నటి హేమ

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ వైఖరిపై హీరోయిన్ హేమ మండిపడింది. పూరీ తీరు ఏమాత్రం ...

Widgets Magazine