మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 జులై 2015 (17:31 IST)

గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌లో పవన్ కల్యాణ్: అసలేం చేస్తున్నట్టు..?

గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్‌లో పవన్ కల్యాణ్ బిజీ బిజీగా ఉన్నట్లు కొందరంటుంటే.. మరికొందరు వేరేదో పేరు ఖరారు కాని సినిమా షూటింగ్‌లో పవన్ వున్నాడని అంటున్నారు. కానీ రియల్‌గా పవన్ ఏ సినిమాలో నటిస్తున్నాడు అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అభిమానులు మాత్రం పవన్ కల్యాణ్ సినిమా కోసం వెయ్యి కనులతో ఎదురుచూస్తున్నారు. అత్తారింటికి దారేది, గోపాల గోపాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌లో పాల్గొంటారని టాక్ వస్తోంది. 
 
ఎట్టకేలకు పవన్ కల్యాణ్ జూలై 29 నుంచి గబ్బర్ సింగ్ 2 షూటింగ్‌లో పాల్గొంటున్నారని డైరక్టర్ బాబీ చెప్పాడు. గబ్బర్ సింగ్ తదుపరి షెడ్యూల్ 29వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. పవన్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొంటాడని బాబీ వెల్లడించాడు. కాగా ఉత్తమ దర్శకుడిగా బాబీ మా సినిమా అవార్డ్2ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. పవర్ సినిమా కోసం ఈ అవార్డు గెలుచుకున్న బాబీ.. రవితేజ, కోన వెంకట్, చక్రి, మోహన కృష్ణ, కిషోర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.