బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: మంగళవారం, 30 జూన్ 2015 (20:22 IST)

పవన్‌ చేసింది కరెక్టేనా...? రాజకీయాల్లో అంతే... అంతే...!!

నటుడు పవన్‌ కళ్యాణ్ ఇటీవలే నోటుకు ఓటు వ్యవహారంపై ట్విట్టర్‌లో పేర్కొన్న విషయాలు సినిమా రంగంలో చర్చకు దారితీశాయి. ఒకవైపు రాజకీయంగా... టీవీ ఛానళ్లలో ఈ విషయమై వివిధ పార్టీల గురించి చర్చిస్తుంటే... సడెన్‌గా పవన్‌ స్పందన ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
అసలు పవన్‌ కళ్యాణ్, సమస్య అంతా సర్దుకునే సమయంలో స్పందించాడని కొందరంటే... తెలివిగా టైమ్‌ చూసుకుని మాట్లాడారని మరికొందరు అంటున్నారు. ఏదియేమైనా.. ఈ విషయంలో ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరించారని అర్థమవుతోంది. అయితే మాటల్లో ఎటువైపు మొగ్గినా... ఆ ప్రభావం ఆయన సినీ కెరీర్‌పై పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మేథావుల సలహా మేరకు ఇటువంటి వ్యాఖ్యలు చేశాడని తెలుస్తోంది.