Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాసరికి పవన్ పరామర్శ... ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన చంద్రబాబు

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:18 IST)

Widgets Magazine
pawan kalyan

సినీ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావుని హీరో పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఊపిరితిత్తులు, కిడ్నీ, అన్నవాహిక సమస్యలతో బాధపడుతున్న దాసరి ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కిమ్స్ వైద్యులు ఆయనకు బుధవారం అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పైనే ఉన్నారు.
 
బుధవారం సాయంత్రం దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత శరత్ మరార్‌తో కలసి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన పవన్.. దాసరిని పరామర్శించారు. దాసరికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్నారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. "దాసరి అనారోగ్యం వార్త బాధ కలిగించింది. ఆయన ఆరోగ్యంపై వైద్యులు నమ్మకంగా ఉన్నారని, ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 
 
మరోవైపు.. దాసరి నారాయణ రావు ఆరోగ్య పరిస్థితిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ఆరా తీశారు. ఈ మేరకు ఆయన దాసరి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Visit Chandrababu Pawan Kalyan Kims Hospital Dasari Narayana Rao

Loading comments ...

తెలుగు సినిమా

news

రామ చరణ్ - సుకుమార్ చిత్రానికి టైటిల్ "పల్లెటూరి ప్రేమలు"?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ...

news

మెగాస్టార్‌కి 10, జూనియర్ ఎన్టీఆర్‌కు 1.. ఏంటిది?

మెగాస్టార్ చిరంజీవికి పది, జూనియర్ ఎన్టీఆర్‌కి 1 అంటే ఏంటనుకుంటున్నారా.. ర్యాంకులండీ ...

news

నేనెవడితో తిరిగితే మీకెందుకోయ్.. నా బయోడేటా మొత్తం కావాలా అంటున్న నటీమణి

చూస్తుంటే ప్రపంచమంతటా మీడియా వ్యవహారం కానీ, ప్రజల ఆలోచనలు కాని ఒకేలాగా కనిపిస్తున్నాయి. ...

news

ఇంత రేంజిలో వళ్లు పెంచావు గద జేజెమ్మా.. వాపోతున్న బాహుబలి యూనిట్

బాహుబలి సిరీస్ అంటేనే గ్రాఫిక్స్ కీలకం అన్న సంగతి తెలిసిందే. దీనికోసం భారీ ఖర్చు కూడా ...

Widgets Magazine