Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'జయమ్ము నిశ్చయమ్మురా'లో సూబర్బ్ సినిమా.. శ్రీనివాస్ రెడ్డికి పవన్ విషెస్

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (16:33 IST)

Widgets Magazine
srinivas reddy

కమెడియన్ శ్రీనువాస్ రెడ్డిని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. చాలా అరుదుగా సినిమాలు చూసే పవన్ కళ్యాణ్, రీసెంట్‌గా "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమాని తిలకించారు. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా క్లీన్ లవ్ ఎంటర్టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. 
 
'జయమ్ము నిశ్చయమ్మురా'లో "అత్తారింటికి దారేది" సినిమా కూడా ఒక కీ రోల్ పోషించింది. ఆ సినిమా బ్యాక్ డ్రాప్‌లో కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని డిజైన్ చేశాడు దర్శకుడు శివాజి. ఆ సీన్స్‌కి థియేటర్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలోనే పవన్ ఇమేజ్ కొన్ని సన్నివేశాలు బలం అందించింది.
 
జయమ్ము నిశ్చయమ్మురా సినిమా ప్రేక్షకులను, విమర్శకులను బాగా మెప్పించింది. నటుడిగా శ్రీనివాస్ రెడ్డి స్థాయిని కూడా పెంచింది. సినిమా చూసిన చాలా మంది శ్రీనివాస్ రెడ్డిని మెచ్చుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి అభినందనలు లభించాయి. 
 
‘నువ్వొక మంచి సినిమా చేశావు. సినిమా చూసి ఎంజాయ్ చేశాను. నీకు నా బెస్ట్ విషెస్’ అని అభినందిస్తూ ఒక ఫ్లవర్ బొకేని శ్రీనివాస్ రెడ్డికి పంపారు పవర్ స్టార్. జయమ్ము నిశ్చయమ్మురా ఇచ్చి సక్సెస్‌తో, కొత్త సినిమాల మీద ఫోకస్ చేస్తూ బిజీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, సడన్‌గా వచ్చిన పవన్ విషెస్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి చెబుతూ పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pawan Bouquet Srinivas Reddy Jayammu Nischayammu Raa

Loading comments ...

తెలుగు సినిమా

news

దైవ సన్నిధిలో ప్రారంభమైన "పెళ్లి కథ"

శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై అని శైని ఎంటర్‌టైన్‌మెంట్స్ ...

news

లాస్యను మరిచిపోను.. రాసుకుంటే రాసుకోండి.. వెంట్రుకతో సమానం: రవి

బుల్లితెర యాంకర్ లాస్యకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థ వేడుకలో సహ ...

news

అనుపమ పరమేశ్వర్ ఆ హీరో నైట్ పార్టీలు... ఆ కిక్కుతో ఇద్దరూ ఎంజాయ్...

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వర్ పేరు మారుమ్రోగుతోంది. శతమానం భవతి చిత్రం ...

news

పవన్ కళ్యాణ్ - కొరటాల శివ కాంబినేషన్‌లో పవర్‌ఫుల్ మూవీ...

కొరటాల శివ. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ...

Widgets Magazine