Widgets Magazine

ప్రేమలో మనుషులు, మనసులు విడిపోతున్నాయి కాన్సెప్ట్‌తో 'పిచ్చిగా నచ్చావ్‌'.

గురువారం, 9 మార్చి 2017 (16:29 IST)

Widgets Magazine
pichiganchav movie still

'ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైన శైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీని వల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? 
 
తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు'' దర్శకుడు వి.శశిభూషణ్‌. సంజీవ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. బుధవారం హైదరాబాద్‌లో అవసరాల శ్రీనివాస్‌ చేతులమీదుగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ బావుందని సినిమా విజయవంతంగా ఆడాలని అవసరాల శ్రీనివాస్‌ ఆకాంక్షించారు.
 
నిర్మాత కమల్‌కుమార్‌ పెండెం మాట్లాడుతూ ''ప్రేమకథలో రూపొందుతున్న చిత్రమిది. కుటుంబ విలువలతో వల్గారిటీ లేకుండా లావిష్‌గా రూపొందించాం. ఇటీవల వరంగల్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో విడుదల చేసిన పాటలకు, ప్రోమోలకు చక్కని స్పందన వచ్చింది. సోషల్‌ మీడియాలో ప్రచార చిత్రాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 17 న సినిమాను విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.
 
దర్శకుడు మాట్లాడుతూ ''ఇటీవల విడుదల చేసిన పోస్టర్లు, ప్రోమోలతో సినిమాకు క్రేజ్‌ పెరిగింది. రొమాంటిక్‌ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులో మెగాబ్రదర్‌ నాగబాబు కీలకమైన పాత్ర పోషించారు. నా ఐడియాను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకు చక్కని నిర్మాత దొరకడం నా అదృష్టం. ఎంచుకున్న కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, ఫోటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. విందు భోజనంలాంటి సినిమా అవుతుంది'' అని అన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జాహ్నవి ఫిలింస్ బ్యానర్‌లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళంలో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్‌ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో ...

news

ఆ చిత్రానికి నంది రావడం అదృష్టం: నటి అంజలి

''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు నంది అవార్డు వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్‌ ...

news

ఆండ్రియాతో సెల్వరాఘవన్ న్యూడ్ ఫిల్మ్?.. దర్శకుడి భార్యకు వివరాలతో హీరోయిన్ మెయిల్? (Andrea Video)

దక్షిణాది చిత్ర పరిశ్రమను సుచీ లీక్స్ ఓ కుదుపు కుదుపుతోంది. ఇప్పటికే పలువురు హీరో, ...

news

రజినీ అల్లుడు ధనుష్‌ను ఆడుకుంటున్నారు... యాక్ థూ.. థూథూ... అంటూ...

సుచీ లీక్స్ దెబ్బకు సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు ధనుష్ జనాలకు ముఖం చూపించలేని ...