బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2015 (12:49 IST)

మొహంజదారో: పూజా హెగ్డే- హృతిక్‌ల రొమాన్స్‌‌తో స్క్రీన్‌పై ఫైర్ తప్పదట!

టాలీవుడ్‌లో ముకుంద, ఒక లైలా కోసం వంటి సినిమాల్లో అందాలతో ఆకట్టుకున్న పూజా హెగ్డే.. బంపర్ ఛాన్స్ దక్కడంతో హృతిక్ రోషన్ సరసన నటించేందుకు బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. చారిత్రాత్మక చిత్రం మొహంజదారో సినిమా షూటింగ్‌లో పూజా హెగ్డే బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి రొమాన్స్ సన్నివేశాలను చిత్రీకరించారు. 
 
రాళ్ల గుహపై హృతిక్, పూజా హెగ్డేలపై తీసిన రొమాన్స్ సన్నివేశాలు తప్పకుండా సిల్వర్ స్క్రీన్‌పై ఫైర్ తప్పదని సినీ పండితులు అంటున్నారు. ఈ సన్నివేశాలు పూజా హెగ్డేల అందాల ఆరబోత అంతా ఇంతా కాదని, లిప్‌లాక్‌లతో హృతిక్, హెగ్డే రెచ్చిపోయారని.. సీన్స్ మాత్రం బాగా పండాయని సినీ యూనిట్ అంటోంది. హృతిక్‌తో ఇలాంటి ఓవర్ రొమాన్స్ సీన్లలో నటించేందుకు పూజా హెగ్డే కాస్త ఇబ్బంది పడినా, ఐశ్వర్యారాయ్, కత్రినా కైఫ్, ప్రియాంకా చోప్రా వంటి అగ్రహీరోయిన్లతో అదరగొట్టేసిన హృతిక్ రోషన్ మాత్రం సునాయాసంగా చేసుకుంటూ పోయాడట. 
 
ఇక మొహంజదారో సినిమాకు ఆస్కార్ నామినేటెడ్ డైరక్టర్ అశుతోష్ గౌరికర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రేమతో కూడిన చారిత్రాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటున్న మొహంజదారో తప్పకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని సినీ పండితులు అంటున్నారు.