శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (16:11 IST)

పవన్ చేతిలో 3 సినిమాలు.. ఆపై రాజకీయాల్లోకి.. నేను కూడా చేరిపోతా: అలీ కామెంట్స్

2019 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోంది. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ కూడా ఈ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెడత

2019 ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటోంది. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ కూడా ఈ ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లో అడుగుపెడతానని పవన్ తెలిపిన నేపథ్యంలో.. పవన్ ఈ విషయంపై నోరెత్తకపోయినా.. ప్రముఖ కమెడియన్ అలీ మాత్రం స్పందించాడు. 
 
రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయన్నాడు. ఆ మూడు సినిమాల షూటింగ్ పూర్తయ్యాక.. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారని అలీ చెప్పుకొచ్చాడు. అంతేగాకుండా తాను కూడా త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతానన్నాడు. 2019 నాటికి ఏదో పార్టీలో చేరుతానని.. అది ఏ పార్టీ అనేది ఇప్పుడే చెప్పలేనన్నాడు. 
 
కాగా 2014లోనే టీడీపీలో చేరతానని అలీ ప్రకటించాడు. అయితే అప్పట్లో ఆ పార్టీలో చేరని అలీ.. ప్రస్తుతం జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్, అలీ మంచి స్నేహితులు కావడంతో అలీ తప్పకుండా జనసేనలోనే చేరుతాడని సినీ పండితులు అంటున్నారు.