మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2015 (14:48 IST)

బాహుబలి ఎఫెక్ట్: హిందీలో దాదా పేరుతో ఏక్ నిరంజన్ విడుదల!

బాహుబలి ఎఫెక్ట్‌తో టాలీవుడ్ హీరో ప్రభాస్.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. రాజమౌళి బాహుబలి పార్ట్-2 షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్.. బాహుబలి ద్వారా 500 కోట్ల రూపాయల కలెక్షన్లతో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ సరసన చేరిపోయాడు. ఇదే ఛాన్స్‌గా తీసుకుని ప్రభాస్ బాలీవుడ్‌లో నటించాలనుకుంటున్నాడు. తొలిమెట్టుగా ఏక్ నిరంజన్ సినిమాను దాదా పేరిట శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. 
 
ఇప్పటికే డబ్బింగ్‌తో పాటు అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దాదాను పూరీ జగన్నాథ్ హిందీలో శుక్రవారం విడుదల చేయనున్నారు. ఇంకా ఏక్ నిరంజన్ హీరోయిన్ కంగనా రనౌత్‌తో పాటు ఇందులో నటించిన సోనూ సూద్, ముకుల్ దేవ్, మార్కండ్ దేశ్ పాండేలు హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన వారే. పూరీ జగన్నాథ్ కూడా ఉత్తరాది ప్రేక్షకులకు బాగా తెలిసినవాడే. దీంతో ఏక్ నిరంజన్ సినిమాను హిందీలో విడుదల చేయడం ద్వారా కలెక్షన్లు రాబట్టవచ్చునని యూనిట్ అనుకుంటోంది.