Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సాహో'' అంటోన్న ప్రభాస్.. త్వరలో ఫస్ట్ లుక్, ట్రైలర్.. సుజిత్‌తో రూ.150 కోట్ల సినిమా

గురువారం, 20 ఏప్రియల్ 2017 (13:35 IST)

Widgets Magazine

'బాహుబలి' చిత్రంతో జాతీయ నటుడిగా పేరు కొట్టేసిన ప్రభాస్.. బాహుబలి సిరీస్‌కు తర్వాత కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అయిపోయాడు. ఐదేళ్ల పాటు బాహుబలి కోసం పనిచేసిన ప్రభాస్ బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఏకంగా రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. అంతేకాదు యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేసేందుకు ప్రభాస్ సిద్ధమైపోయాడు. 
 
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కోసం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫస్ట్‌లుక్ వారం రోజుల్లో రిలీజ్ కానుంది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ''సాహో" అనే టైటిల్‌ను ఖరారు చేశారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 23న ప్రభాస్ సుజిత్ దర్శకత్వంలో నటించనున్న''సాహో'' ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌పై ప్రకటన రానుంది. 
 
ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ సినిమాను 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపుదిద్దుకునే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బ్లూ ఫిల్మ్స్‌లో నటిస్తా... ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.. తెలుగు నటి బంపర్ ఆఫర్

నీలి చిత్రాల్లో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నా.. ఎవరైనా ఉంటే ఉపయోగించుకోవచ్చు అంటూ ఓ నటి ...

news

రేణూ దేశాయ్ 'బద్రి' చేదు జ్ఞాపకాలు... నా కళ్లలో నీటితెర చూశారా...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. ...

news

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు ...

news

'బాహుబలి' బడ్జెట్ రూ.2 బిలియన్లు... శివగామి రెమ్యునరేషన్ రూ.కోటి.. ఇదేం న్యాయం జక్కన్నా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ...

Widgets Magazine