Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇకపై 'బాహుబలి'లాంటి చిత్రం చేయను... అలాకాకుంటే నిర్మాతలు నష్టపోతారు : ప్రభాస్

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:48 IST)

Widgets Magazine
prabhas

అమరేంద్ర బాహుబలి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 28వ తేదీన 'బాహుబలి-2' రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్ర యూనిట్ మునిగిపోయివుంది. ఈ నేపథ్యంలో సినిమాలో యాంగ్రీగా కనిపించే ప్రభాస్ ఇక్కడ మీడియా వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చాలా కూల్‌గా సమాధానం ఇస్తున్నారు.
 
తాజాగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ... 'బాహుబలి'ని ఎంజాయ్ చేశా. మళ్లీ ఇలాంటి సినిమా ఎవరైనా చేద్దామంటే నా వల్ల కాదు. అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అలాంటిదేమైనా ఆఫర్ వస్తే చేస్తానేమో అని ప్రభాస్ స్పష్టం చేసారు.
 
ఇకపోతే.. నిర్మాతలు మాపై నమ్మకంతో రూ.కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేనంత ఖర్చు పెట్టారు. అందుకే మొదటి భాగం రిలీజ్ సమయంలో భయంకరమైన టెన్షన్ ఉండేది..... తొలి భాగం హిట్టయింది కాబట్టి రెండో భాగం విషయంలో అప్పుడున్నంత టెన్షన్ లేదు. కాన్ఫిడెంటుగా ఉన్నామని ప్రభాస్ తెలిపారు.
 
అలాగే, ఈ చిత్రం కోసం రాజమౌళి ఎంత హార్డ్‌వర్క్ చేశాడు? నేను ఎన్నేళ్లు టైమ్ కేటాయించాను? అనేవి పక్కన పెడితే ... లైప్‌లో మళ్లీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాతలు ఖర్చుపెట్టారు. హిట్టయితే సరిపోదు. హిట్టయినా ప్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి.... వేరే ఛాయిస్ లేదు. అప్పుడు నిర్మాతలు సేఫ్ అవుతారు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నన్ను కిడ్నాప్ చేసి.. ఆపై వ్యవహారాన్ని నడిపిందల్లా ఓ మహిళ: భావన

మలయాళ నటి భావన కిడ్నాప్, కార్లో ఆమెపై లైంగిక వేధింపుల ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం ...

news

ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఎంజాయ్ చేస్తున్న మామ - కోడలు... చైతూ పరిస్థితేంటి?

మామ కోడలు తెగ ఎంజాయ్ చేస్తున్నారట. వీరిద్దరి తొలి ఎక్స్‌పీరియన్స్‌ను కూడా రుచిచూశారట. ...

news

'నా లైఫ్.. నా యిష్టం... మీరెవరూ నీతులు చెప్పేందుకు' : ఇలియానా ఫైర్

గోవా బ్యూటీకి కోపమొచ్చింది. తనపై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లపై ఆమె మండిపడ్డారు. నా ...

news

రాజమౌళికి షాక్... మహాభారతం చిత్రాన్ని రూ.1000 కోట్లతో ప్రొడ్యూస్ చేస్తానంటూ...

మహాభారతం, రామాయణం గాథలు ఎప్పుడు విన్నా, చూసినా ఎవర్ గ్రీన్ అనే సంగతి మనకు తెలిసిందే. ...

Widgets Magazine