గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2015 (16:10 IST)

నిర్మాతగా మారిన ప్రభుదేవా... లోగో విడుదల..

టాలీవుడ్, కోలీవుడ్‌లలో డ్యాన్స్ పేరుతెచ్చుకుని, పిమ్మట నటుడిగా మారి, ఆ తర్వాత బాలీవుడ్‌లో దర్శకుడిగా నిలదొక్కుకున్న ప్రభుదేవా ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా ఆయన నిర్మాతగా మారనున్నట్టుగా వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. తన సొంత నిర్మాణ సంస్థ 'ప్రభుదేవా స్టూడియోస్'కి సంబంధించిన 'లోగో'ను విడుదల చేశారు.
 
ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిభ కలిగిన వారిని తమ సంస్థ ఆహ్వానిస్తుందన్నారు. అన్ని తరగతుల ప్రేక్షకులను అలరించే సినిమాలు తమ బ్యానర్ నుంచి వస్తాయని ప్రభుదేవా తెలిపారు. క్రియేటివ్ టీమ్ ద్వారా ఈ బ్యానర్ నుంచి సినిమాలు వస్తుంటాయని అన్నారు. ఈ బ్యానర్‌పై రానున్న మొదటి సినిమా పట్ల కొంత మంది ఆసక్తిని వ్యక్తం చేయగా, ఆ వివరాలను ఆగస్టు మూడో తేదిన వెల్లడిస్తానని ప్రభుదేవా తెలిపారు.