Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎస్.ఎస్ రాజమౌళి మోసం చేశారు... బాధగా ఉంది. : విలన్ ప్రదీప్‌ రావత్‌

ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (10:26 IST)

Widgets Magazine
pradeep rawat

ఎస్ఎస్ రాజమౌళి తనను మోసం చేశారంటూ టాలీవుడ్ ప్రతినాయకుడు ప్రదీప్ రావత్ అంటున్నారు. అలాగే, రాజమౌళి తనకు గురువు అని, ఆయన రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెపుతున్నారు. ఇంతకీ ప్రదీప్ రావత్ ఇలా ఎందుకు అన్నారో పరిశీలిద్ధాం. 
 
రాజమౌళి 'లగాన్‌' చిత్రం చూసి నా నటన మెచ్చుకుంటూ తన మేనేజర్‌ను ముంబైలోని అమీర్‌ఖాన్‌ ఆఫీసుకు పంపించారు. అక్కడ నా అడ్రస్‌ తెలుసుకుని ఆ మేనేజర్‌ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఆ వెంటనే రాజమౌళితో ఫోన్లో మాట్లాడాను. నన్ను హైదరాబాద్‌ రమ్మని చెప్పారు. నేను వెళ్లి ఆయన కలవడం, ఆయిన ఇచ్చిన ఆఫర్‌కు ‘సై’ అనడం జరిగాయి. తెలుగులో నేను నటించిన మొదటి చిత్రం ‘సై’. సూపర్‌హిట్‌ మూవీ. ఈ చిత్రంలో అంత బాగా నటిస్తానని నేనే అనుకోలేదు. ఇక అప్పటి నుండి తెలుగులో మంచిపాత్రల్లో నటించేందుకు అవకాశాలు రావడం ఆరంభమైంది.
 
ముఖ్యంగా.. రాజమౌళి మరో చిత్రం ‘ఛత్రపతి’లో కూడా విలన్‌గా నా నటన అద్భుతం అని ఎంతోమంది అభిమానులు నాపైన అభినందనల వర్షం కురిపించారు. ఇంత చక్కని అవకాశం కల్పించిన రాజమౌళికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన నాకు గాడ్‌ఫాదర్‌. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలూ నాకు రెండు కళ్ళులాంటివన్నారు. 
 
అయితే, బాహుబలిలో ఎంత చిన్న పాత్ర ఇచ్చినా చేయాలనే కుతూహలం ఉండేది. అందులో నటించలేకపోయాననే బాధ ఉంది. బాహుబలి–2కి కూడా నన్ను పిలవకపోవడం ఇంకా బాధ అనిపించింది. హమ్‌ జబర్దస్తీ నయ్‌ జా సక్తేనా (బలవంతంగా వెళ్ళి అడగలేనుగా). పిలవకపోవడానికి బలమైన కారణం ఉండే ఉంటుందేమో! అది ఆయనకే వదిలేద్దాం. అయినా గానీ రాజమౌళి నాకు ఎప్పటికీ గాడ్‌ ఫాదరే. భవిష్యత్తులో ఎప్పటికైనా మళ్ళీ ఆయన చిత్రంలో నటించాలని ఉందని చెప్పారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tollywood Baahubali2 Cheat Ss Rajamouli Pradeep Rawat

Loading comments ...

తెలుగు సినిమా

news

కాలకేయ ప్రభాకర్ ఇప్పుడెక్కడున్నారు.. ఒక్క సినిమాతోనే వైభవం ముగిసిపోయిందా...?

మర్యాద రామన్న చిత్రంలో బైరెడ్డి పాత్ర గుర్తుందా.. సినిమాలంటే ఓనమాలు తెలియని ఒక తెలంగాణ ...

news

నాలుగోసారి.. ఐశ్వర్యారాయ్‌తో మణిరత్నం కొత్త సినిమా

మణిరత్నం, ఐశ్వర్యా రాయ్.. ఈ రెండు పేర్లు వినగానే దక్షిణాది ప్రేక్షకులలో అందరికీ గుర్తు ...

news

సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్టు.. ఫ్యామిలీ ప్రాజెక్టూ... ఇంజనీర్ త్రివిక్రమ్, పిల్లర్ పవన్ కల్యాణ్

కాటమరాయుడు చేదు అనుభవం తర్వాత పవన్ కల్యాణ్ తీస్తున్న తాజా చిత్రానికి త్రివిక్రమ్ ...

news

అమీర్ ఖాన్‌తో 'మహాభారతం' చిత్రంపై మాట్లాడా... కానీ...? రాజమౌళి

బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపైన భారతదేశ వ్యాప్తంగా భారీ ...

Widgets Magazine