ఎన్టీఆర్ పాత్రకు ప్రకాష్ రాజ్.. మరి లక్ష్మీ పార్వతిగా ఎవరు?

మంగళవారం, 10 అక్టోబరు 2017 (12:34 IST)

prakash raj

స్వర్గీయ ఎన్టీరామారావు జీవిత చరిత్ర ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇప్పటికే ఆయన రిలీజ్ చేశారు. ఇపుడు నటీనటుల ఎంపికపై ఆర్జీవీ దృష్టిసారించనున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రను ప్రకాశ్ రాజ్‌తో చేయించాలనే తలంపులో వర్మ వున్నట్టు సమాచారం. ప్రకాశ్ రాజ్ విలక్షణ నటుడు .. హావభావాలను అద్భుతంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. అందువల్ల ఆయనైతే ఎన్టీఆర్ పాత్రకి కరెక్ట్‌గా సెట్ అవుతాడని వర్మ భావిస్తున్నాడట. 
 
ప్రకాశ్ రాజ్‌తో సంప్రదింపులు జరపడానికి సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. ఇది నిజమే అయితే .. వివాద స్పదమైన ఈ సినిమాలో నటించడానికి ప్రకాశ్ రాజ్ అంగీకరిస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది. అలాగే, లక్ష్మీపార్వతి పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారోననే ఆత్రుత పెరుగుతోంది. 
 
కాగా, 1997 జనవరి 14వ తేదీన "ఇరువర్" అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్ మరో హీరో పాత్ర పోషించారు. తమిళ మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్‌ స్నేహం, రాజకీయ వైరాన్ని ఇతివృత్తంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో కరుణానిధి పాత్రను తమిళ్ సెల్వన్ పేరుతో ప్రకాశ్ రాజ్ అద్భుతంగా పోషించిన విషయం తెల్సిందే. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హేయ్ పవన్... మీలో పవనిజం 100 శాతం వుంది... కానీ మీ ఇజంలో అది 90 శాతం లేదు...

రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీ హీరోల్లో పవన్ కళ్యాణ్ ను మాత్రం మరింత నిశితంగా ...

news

పవన్ కళ్యాణ్‌కు పుత్రోత్సాహం... లెజ్నోవాకు మగబిడ్డ

హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో ...

news

నిద్రమాత్రలు మింగిన హీరో డాక్టర్ రాజశేఖర్... ఎందుకు?

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, ...

news

కాసుల వర్షం కురిపిస్తున్న 'జై లవ కుశ' - 'స్పైడర్'

దసరా పండుగకు రిలీజ్ అయిన స్టార్ హీరోల చిత్రాలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పండుగ సీజన్ ...