గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (13:35 IST)

ప్రణీత ఫైట్స్ అదుర్స్: డైనమైట్‌లో డూప్ లేకుండా ఫైట్స్ చేసిన అందాల బొమ్మ!

అత్తారింటికి దారేదీ సినిమాలో పవన్ కల్యాణ్‌తో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడించుకున్న ప్రణీత మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న డైనమైట్ సినిమాలో యాక్షన్స్ సీన్స్‌తో అదరగొట్టింది. అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ ప్రణీత డైనమైట్ సినిమా కోసం డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసింది. 
 
దీనిపై విష్ణు మాట్లాడుతూ.. హీరోకు ధీటుగా ప్రణీత ఫైట్స్‌ చేసింది. హీరోయిన్ ఫైట్స్ చేయడం గొప్ప విషయమనీ, ఆమె బాడీ యాక్షన్‌ చేయడానికి చాలా అనుకూలించిందని విష్ణు కితాబిచ్చాడు. ఫైట్‌ మాస్టర్‌ విజయన్‌ ఆధ్వర్యంలో ప్రణీత యాక్షన్‌ సీక్వెల్స్‌ చేసింది. అన్ని రకాల కమర్షియల్‌ అంశాలతో డైరెక్టర్‌ దేవా ఆద్యంతం ఆసక్తికరంగా చిత్రాన్ని మలిచారనీ, యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సమపాళ్లలో ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుందనే గట్టి నమ్మకం ఉందనీ ఆయనన్నారు. 
 
‘‘యాక్షన్‌ సన్నివేశాల కోసం హీరో విష్ణు రిహార్సల్స్‌ చేయడం చూసి, ఆయన పర్ఫార్మెన్స్‌కు మ్యాచ్‌ అవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా రిహార్సల్స్‌ చేసి బాడీ డబుల్‌ లేకుండా యాక్షన్‌ సీన్లు చేశాను. ఇందుకు విష్ణు, ఫైట్‌మాస్టర్‌ విజయ్‌ ఎంతగానో సహకరించారు’’ అని ప్రణీత వెల్లడించింది.